
ప్రేమ మైకంలో ఆ హీరోయిన్ కళ్లు మూసుకుపోయాయి. కరుడుగట్టిన ఆ ప్రియుడి మోజులో సొంత అన్ననే చంపించింది ఆ కసాయి హీరోయిన్. తమ ప్రేమను వ్యతిరేకిస్తున్న అన్నయ్యను ప్రియుడితో కలిసి ఆ హీరోయిన్ అతి కిరాతకంగా మెడ, మొండి వేరు చేసి చంపించింది. ఇంతటి దుర్మార్గమైన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి నగర శివారు దేవరగుడిహళ్లిలో చోటుచేసుకుంది.
దేవరగుడిహళ్లిలోని చెత్త కుప్పలో కేవలం మొండం మాత్రమే ఉన్న ఒక యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే తల కనిపించకపోవడంతో ఆ శవం ఎవరిది అనేది తేలలేదు. కానీ సాయంత్రానికి తల దొరికింది. దీంతో యువకుడి గుర్తింపు సాధ్యమైంది.
చనిపోయింది నగరానికే చెందిన రాకేష్ అని.. రెండు రోజులుగా కనిపించడం లేదని పోలీసులు విచారణలో కనిపెట్టారు. రాకేష్ కాల్ డేటా.. కుటుంబం, ఇతర వ్యవహారాలు విచారించగా అసలు విషయం బయటపడింది.
రాకేష్ కు సోదరి కర్ణాటకలో హీరోయిన్ గా కొనసాగుతున్న నయన. ఈమె ఇప్పటికే కన్నడలో రెండు సినిమాల్లో నటించింది. అయితే నయన కొద్దిరోజులుగా నియాజ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. వేరే మతస్థుడు కావడంతో రాకేష్ అక్క ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అక్కను ప్రేమించొద్దంటూ హెచ్చరిస్తున్నాడు. వీరి ప్రేమకు అడ్డుపడుతున్నాడు.
అయితే మన ప్రేమకు అడ్డుగా ఉన్న మీ సోదరుడిని ఏం చేద్దాం అని ప్రియుడు నియాజ్ అడగ్గానే చంపేద్దామని హీరోయిన్ నియాన్ చెప్పిందని పోలీసుల విచారణలో తేలింది.
దీంతో పక్కా ప్లాన్ తో నియాజ్, తన స్నేహితులైన తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే మరో ముగ్గురితో కలిసి రాకేష్ ను అతి కిరాతకంగా చంపేశాడు. అతడి తల మొండెం వేరు చేసి హత్య చేశారు.
కేవలం తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే సొంత తమ్ముడిని చంపించిన హీరోయిన్ నయన వ్యవహారం సంచలనమైంది. పోలీసులు నిగ్గుతేల్చి నియాజ్ తోపాటు నలుగురిని , నయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.