
తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 1,03,770 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 7,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 33 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58148 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.