The Family Man Season 3 Teaser Review: ఓటీటీ ఆడియన్స్ ని విపరీతంగా అలరించిన వెబ్ సిరీస్ లలో ఒకటి ‘ది ఫ్యామిలీ మ్యాన్'(The Family Man). ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ మనోజ్ బాజ్పాయ్(Manoj Bajpayee) (కొమరం పులి విలన్) లీడ్ రోల్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. లాక్ డౌన్ సమయం లో మొదటి సీజన్ విడుదలై మంచి హిట్ అయ్యింది. ఇక 2021 వ సంవత్సరం లో రెండవ సీజన్ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండవ సీజన్ లో మెయిన్ విలన్ గా ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె విలనిజం చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. అదే విధంగా ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. కేవలం ఈ సీజన్ కారణంగానే సమంత, నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) విడిపోయారు అనే టాక్ ఉంది.
ఈ సిరీస్ ని రాజ్ & డీకే నిర్మించారు. ఇది వరకు వాళ్ళు అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో అనేక విజయవంతమైన ఓటీటీ వెబ్ సిరీస్ లను నిర్మించారు. రెండవ సీజన్ కి దర్శకుడిగా రాజ్ నిడిమోరు వ్యవహరించాడు. త్వరలో విడుదల కాబోతున్న మూడవ సీజన్ కి కూడా ఆయనే దర్శకుడు. మొదటి సీజన్ లో జీవితం లో కుటుంబం తో పూర్తి స్థాయిలో స్థిరపడని శ్రీకాంత్ తివారి అనే ఒక స్పై, టెర్రరిస్ట్ ఎటాక్ ని తన టీం తో కలిసి విచారిస్తూ ‘మిషన్ జుల్ఫీకర్’ ని బ్రేక్ చేస్తారు. ఇక రెండవ సీజన్ స్టోరీ విషయానికి వస్తే ఉద్యోగం వదిలేసి కుటుంబం తో ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్న శ్రీకాంత్ తివారి కి,దేశం లోకి అడుగుపెట్టిన మరో కొత్త శత్రువు రాజీ ని అంతం చేయడానికి మళ్ళీ తిరిగి ఉద్యోగం లో చేరుతాడు. అనుకున్న పనిని విజయవంతంగా తన టీం తో కలిసి పూర్తి చేస్తాడు.
ఇక మూడవ సీజన్ లో శ్రీకాంత్ తివారి కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని విజయవంతంగా తన టీం తో కలిసి ఎలా ఛేదించి దేశానికీ రక్షణ కల్పించాడు అనేది చూపించబోతున్నారు. టీజర్ చాలా స్టైలిష్ గా అనిపించింది. చూస్తుంటే ఈ సీజన్ కూడా పెద్ద అయ్యేలాగానే కనిపిస్తుంది. ఈ సిరీస్ ఈ ఏడాది నవంబర్ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుందట. చూడాలి మరి ఈ సిరీస్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది అనేది. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ సరికొత్త టీజర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.