BRS Workers Attack Mahaa TV: ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు ఆఫీసులోకి చొరబడి అద్దాలు, కార్లు, స్టూడియో సామగ్రిని ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో రెండు కార్లు, ఆఫీస్ అద్దాలు తీవ్రంగా పాడయ్యాయి. తొలుత మహా టీవీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసిన గులాబీ పార్టీ నేతలు, అనంతరం ఆందోళన పెరిగి దాడిగా మారింది. మహా న్యూస్ సిబ్బంది తమపై “ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ దాడిపై మహా న్యూస్ చీఫ్ వంశీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోతున్న మహా న్యూస్ చానల్ సిబ్బంది https://t.co/NGearvfkk1 pic.twitter.com/iR9ODS9cqb
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025