
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు అగ్రికల్చర్ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్దమైన మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. నల్గొండపట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.