Thaman tweet on OG Movie: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ ఫలితం పై నిరాశతో ఉన్నారు. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఆరేళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న ఈ సినిమా పై, బాగా ఆలస్యం అయ్యింది అనే కారణం చేత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రతీకూల పరిస్థితుల మధ్య వస్తున్న చిత్రానికి నెగిటివ్ టాక్ రాకూడదని అభిమానులు చాలా గట్టిగా కోరుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు అభిమానులు కోరుకున్నది జరగలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్రమైన నిరుత్సహం కలిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మంచి ఊపులోకి రావాలంటే టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ(They Call Him OG) నుండి ఒక క్రేజీ అప్డేట్ రావాల్సిందే. ఇప్పటికే అభిమానులు గ్లింప్స్ వీడియో కి మెంటలెక్కిపోయి ఉన్నారు.
Read Also: ‘హరి హర వీరమల్లు’ హిందీ లో క్లిక్ అవుతుందా..? డిమాండ్ మామూలుగా లేదుగా!
ఈ చిత్రం పై నేడు ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవ్వడానికి ముఖ్యకారణం ఆ గ్లింప్స్ వీడియో నే. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమా నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సమయం లో విజయవాడ లో వరదలు భీబత్సం సృష్టించడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ మొదటి లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్ ని ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల అవ్వడానికి రెండు నెలలకంటే తక్కువ సమయం ఉంది. ఆగష్టు నెల ఆరంభం నుండే ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో, ఆగష్టు 2 లేదా 3 తేదీలలో ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. నేడు, లేదా రేపు ఈ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ మేకర్స్ నుండి అధికారికంగా రానుంది.
Read Also: సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ ఏమైంది..? పాపం ఈ రేంజ్ లో తొక్కేశారా!
ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ని పరోక్షంగా ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు. ‘కల్ట్స్..గెట్ రెడీ’ అంటూ గన్ ఎమోజీతో పాటు, టార్గెట్ ఎమోజీ ని కూడా పెడుతూ ఒక ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. అంటే ఫైర్ స్ట్రోమ్ సాంగ్ ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తి అయ్యింది అని దాని అర్థం అన్నమాట. ఈ పాటను తమిళ స్టార్ హీరోలలో ఒకరైన శింబు పాడాడు. ఈ పాట పాడినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ డైరెక్టర్ గట్టిగా ఫోర్స్ చేయడంతో శింబు ఆ రెమ్యూనరేషన్ ని తీసుకొని, విజయవాడ వరద బాధితుల కోసం విరాళం గా అందించాడు. అప్పట్లో శింబు చూపించిన ఈ చొరవని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో మురిసిపోయారు. ఈ కాలంలో ఇంత గొప్ప మనుషులు కూడా ఉంటారా అని అప్పట్లో కామెంట్స్ చేశారు.