MM Keeravani out of Vishwambara: మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఆస్కార్ అవార్డు సంపాదించిన ఏకైక వ్యక్తి కీరవాణి(MM Keeravani). అసలు మన తెలుగు వాళ్లకు కలలో అయినా ఆస్కార్ అవార్డు వస్తుందా అని అనుకునే మనకు ఆ స్వప్నాన్ని నిజం చేసి చూపించాడు. అలాంటి డైరెక్టర్ తనకు ఆస్కార్ వచ్చిన వెంటనే ఒప్పుకున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ట(Vasistha Malladi) దర్శకత్వంలో కీరవాణి సంగీత సారథ్యం లో విశ్వంభర అనే చిత్రం మొదలైంది అనే వార్త విన్నప్పుడు అభిమానుల్లో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రీసెంట్ గా డైరెక్టర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కావాలని ఇదంతా చేశారు. గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో టీజర్ లో లేదు నిజమే, కానీ మరీ అంత నెగిటివ్ చెయ్యాల్సిన అవసరం లేదు, ట్రైలర్ తో చూపిస్తా నా సత్తా ఏంటో అని చెప్పుకొచ్చాడు.
Also Read: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
ఇది కాసేపు పక్కన కీరవాణి గురించి కూడా ఈ చిత్రం విషయం లో సోషల్ మీడియా లో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. కీరవాణి ఇస్తున్న ట్యూన్స్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి అసలు నచ్చడం లేదని, మళ్ళీ మళ్ళీ రీ వర్క్ చేయిస్తున్నారని, ఆ కారణం చేతనే సినిమాలోని ఒక కీలక ఘట్టం లో వచ్చే స్పెషల్ సాంగ్ కి కీరవాణి ని తప్పించి ‘భీమ్స్’ ని ఎంచుకున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ పై కూడా డైరెక్టర్ వశిష్ఠ రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను స్పెషల్ సాంగ్ కోసం కూడా కీరవాణి గారినే ముందుగా అడిగాను. కానీ అప్పుడు ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ రీ రికార్డింగ్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నాకు కూడా ఈ స్పెషల్ సాంగ్ అర్జెంట్ అవసరం ఉంది సార్ అని కీరవాణి గారితో చెప్పాను’.
Also Read: ప్రీమియర్ షో ల వల్లనే సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతున్నాయా..? అసలేం జరుగుతోంది..?
అప్పుడు ఆయన నాకోసం ఎదురు చూడకు, వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో ఆ స్పెషల్ సాంగ్ చేయించుకో. నేను ఇక్కడ ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీ గా ఉన్నాను, ఒత్తిడి ఎక్కువ ఉంది అంటూ కీరవాణి గారు చెప్పుకొచ్చారు. నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేస్తే మీకు, నాకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని మీడియా లో ఇష్టమొచ్చిన కథనాలు రాసుకుంటారు సార్ అని చెప్పాను, వాటిని అసలు పట్టించుకోకు, మనకు పని ముఖ్యం అని చెప్పాడు. అప్పుడు మేము వేరే ఛాయస్ లేక భీమ్స్ ని ఆ పాట కోసం ఎంచుకున్నాము. సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్, రీ రికార్డింగ్, మరియు ఇతర మ్యూజిక్ వర్క్స్ మొత్తం కీరవాణి గానే చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పాటలో నాగిని ఫేమ్ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి ఆడిపాడనుండి.