Telugu senior heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి స్టార్ హీరోలు చేసే సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అలాగే వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని ఎపిక్ సినిమాలు అయితే కనిపించే విధంగా సినిమాలు ఉండేలా వారు చూసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు ఫ్రీడమ్ ఫైటర్ గా చేస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. కృష్ణ లాంటి హీరో సైతం అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వెనుతిరిగి చూడకుండా వరుసగా సక్సెస్ లను సాధించి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. ఇక ఆయన బాటలో నడిచిన చాలామంది హీరోలకి ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలు పెద్దగా అచ్చి రాలేదనే చెప్పాలి. చిరంజీవి సైరా నరసింహారెడ్డి (Syra Narasimha Reddy) తో ఫ్రీడమ్ ఫైటర్ సినిమాని చేసినప్పటికి అది పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
Also Read: అక్కినేని హీరోల్లో ఫైర్ తగ్గిందా..? మెగా , నందమూరి హీరోల మాదిరిగా సక్సెసులు ఎందుకు సాధించడం లేదు…
ఇక బాలయ్య బాబు ఒక్క మగాడు (Okka Magadu) సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపించాడు. అయినప్పటికి అది కూడా ఏమాత్రం ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వంలో వెంకటేష్ సైతం సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose) అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించిన సినిమా చేశాడు.
ఇది ఫిక్షన్ స్టోరీ అయినప్పటికి అది ఏమాత్రం ప్రేక్షకుడిని రంజింప చేయలేకపోయింది… ఇక కృష్ణ చే అల్లూరి సీతారామరాజుగా మెప్పించడానికి గల కారణం ఏంటి? మిగతా హీరోలు చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే కృష్ణ చరిత్రలో ఏం జరిగిందో ఆ స్టోరీని రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
Also Read:బాలయ్య ఆ ఒక్క సినిమా చేసి ఉంటే రికార్డులు తిరగరాసేవాడా..?
ఇక మిగతా హీరోలందరు చరిత్రను వక్రీకరించేలా సీన్స్ ని రాసుకొని సినిమాటిక్ వే లో ఫిక్షన్ స్టోరీ ని ఆడ్ చేసి సినిమా చేయడం వల్ల ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు… అందుకే కొన్ని సెన్సిబుల్ సబ్జక్ట్స్ ని డీల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటూ జాగ్రత్తగా సినిమాలను చిత్రీకరిస్తే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా మారుతాయి. లేకపోతే మాత్రం భారీ డిజాస్టర్లుగా మిగులుతాయని ఈ సినిమాలను చూస్తే మనకు అర్థమవుతోంది…