https://oktelugu.com/

Prashanth Neel and NTR : ఎన్టీయార్ మూవీ కోసం మహారాష్ట్ర సెట్ వేయించిన ప్రశాంత్ నీల్…ఎన్టీయార్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే పూనకలు వస్తాయి…ఇది కదా కావాల్సింది…

నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీ ని ఇస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Written By: , Updated On : February 20, 2025 / 08:09 AM IST
Prashanth Neel , NTR

Prashanth Neel , NTR

Follow us on

Prashanth Neel and NTR : నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీ ని ఇస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, గత పది సంవత్సరాల నుంచి ఫ్లాప్ సినిమా అనేది లేకుండా ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఏ క్యారెక్టర్ అయిన సరే అలవోకగా పోషించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక గత సంవత్సరం కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో చేసిన దేవర (Devara) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే కొంత వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. అందుకే ఈ సంవత్సరం ఎలాగైనా సరే ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో కాంబినేషన్ సెట్ చేయాలని చూసినా ఎన్టీఆర్ ఎట్టకేలకు ఆ కాంబినేషన్ అయితే సెట్ చేశాడు. ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ధోరణిలో మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అందుకే ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీ లో జరగబోతుంది. ఇక దాని కోసం మహారాష్ట్రకు సంబంధించిన భారీ సెట్ కూడా వేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ అంటే భారీ సెట్లు వేసి సినిమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటివే మనకు కనిపించబోతున్నాయి. ఇక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నాయట. 1950 నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే మరోసారి ప్రశాంత్ నీల్ 1950 బ్యాక్ డ్రాప్ లోనే సినిమాని తీస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. సలార్ (Salaar) సినిమాతో ప్రభాస్ (Prabhas) కి అదిరిపోయే సక్సెస్ ని అందించిన ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఆయన కంటూ ఒక మంచి గుర్తింపును క్రియేట్ చేసి పెడుతుందా? లేదా అనే ధోరణిలోనే అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ యాక్షన్ రొల్ ను పోషించబోతున్నాడట. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఒక యోధుడిగా మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…