Tamannaah Batia : స్టార్ లేడీ తమన్నా భాటియా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. 2023 న్యూ ఇయర్ వేడుకలు తమన్నా-విజయ్ వర్మ కలిసి రహస్యంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ మేటర్ బయటకు రావడంతో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. మొదట్లో అలాంటిదేమి లేదని ఖండించారు. అనంతరం ఒప్పుకున్నారు. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో తమన్నాతో విజయ్ వర్మ జతకట్టాడు. ఈ బోల్డ్ సిరీస్ షూటింగ్ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విజయ్ వర్మ చాలా కేరింగ్. జీవితాంతం నన్ను భద్రంగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. అందుకే ప్రేమించాను అని చెప్పుకొచ్చింది.
ప్రేమను బహిర్గతం చూశాకా.. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. విదేశాల్లో విహరించారు. ఈవెంట్స్ కి జంటగా హాజరయ్యారు. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించడం లేదు. వారి చర్యలు అనుమాస్పదంగా ఉన్నాయి. కొద్దీ రోజులుగా బాలీవుడ్ మీడియాలో తమన్నా-విజయ్ వర్మ విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.
Also Read : ఇంస్టాగ్రామ్ లో ప్రియుడు విజయ్ వర్మ ఫోటోలను తొలగించిన తమన్నా..నా హృదయం ముక్కలైంది అంటూ కామెంట్స్!
తాజాగా తమన్నా పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ప్రేమ, రిలేషన్ కి అర్థం తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎక్కడ షరతులు మొదలవుతాయో అక్కడ ప్రేమ ఉండదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రేమ నిస్వార్ధమైనది. అక్కడ ఎలాంటి షరతులు ఉండవు. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలో అనే అంచనాలు ఏర్పడకూడదు. అలా అయితే అది వ్యాపారం అవుతుంది. ప్రేమ భావోద్వేగాలతో కూడుకొన్నది. మనం ఒకరిని ప్రేమిస్తే వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. భావాలను గౌరవించాలి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి కంటే లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, అన్నారు.
తమన్నా పరోక్షంగా విజయ్ వర్మతో విడిపోయినట్లు చెప్పింది. అలాగే.. విజయ్ వర్మ తనకు షరతులు పెడుతున్నాడు, స్వేచ్ఛను ఇవ్వడం లేదు. అందుకే వదులుకున్నాను అని తమన్నా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. తమన్నా 2023లో భోళా శంకర్ చేసింది. మరలా తెలుగులో సినిమా చేయలేదు. సంపంత్ నంది దర్శకత్వంలో ఓదెల 2 చేస్తుంది. ఇటీవల కుంభమేళా వేదికగా ఓదెల 2 టీజర్ విడుదల చేశారు. తెలుగులో తమన్నాకు ఆఫర్స్ తగ్గాయి. ఆమె డిజిటల్ సిరీస్లు, హిందీ చిత్రాల మీద దృష్టి పెట్టింది.
Also Read : ప్రియుడితో తమన్నా విడిపోయినట్లేనా.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మిల్కీ బ్యూటీ ఎఫైర్!