వలస కూలీల బాధ్యత కేంద్రానిదే… సుప్రీం స్పష్టం

వలస కూలీలను ఎక్కడివారక్కడే ఉండేటట్లు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి ఊరుకున్న ప్రభుత్వాన్ని ఒక విధంగా సుప్రీం కోర్ట్ మందలించింది. సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న వలస కూలీలను నిలువరించి వెంటనే వారిని షెల్టర్‌ హోంలకు తరలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారికి ఆహారం, అవసరమైన వైద్య సహాయం అందించాలని స్పష్టం చేసింది. పోలీసులను ఉపయోగించకుకండా, వారికి నచ్చ చెప్పాలని, ఆయా వర్గాలకు చెందిన నాయకులతో వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిందిగా సూచించింది. […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 5:01 pm
Follow us on

వలస కూలీలను ఎక్కడివారక్కడే ఉండేటట్లు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి ఊరుకున్న ప్రభుత్వాన్ని ఒక విధంగా సుప్రీం కోర్ట్ మందలించింది. సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న వలస కూలీలను నిలువరించి వెంటనే వారిని షెల్టర్‌ హోంలకు తరలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారికి ఆహారం, అవసరమైన వైద్య సహాయం అందించాలని స్పష్టం చేసింది. పోలీసులను ఉపయోగించకుకండా, వారికి నచ్చ చెప్పాలని, ఆయా వర్గాలకు చెందిన నాయకులతో వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిందిగా సూచించింది. షెల్టర్ హోమ్ లను కూడా పోలీసులతో కాకుండా స్వచ్ఛంద సేవకులతో నిర్వహించేటట్లు చూడాలని హితవు చెప్పింది.

వలసకూలీలు, కరోనా నివారణ అంశాలపై సుప్రీంకోర్టు నేడువిచారణ చేపట్టింది. కరోనా విలాస్ గురించి వదంతులు వ్యాపించి, ప్రజలలో భయాందోళనలు వ్యాప్తి చేయకుండా చూడటం కోసం 24 గంటలలో కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వస్తావ సమాచారాన్ని ఇస్తూ ఉండాలని ఆదేశించింది.

కేంద్రం సమర్పించిన లాక్‌డౌన్‌ స్టేటస్‌ రిపోర్టులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 22.8 లక్షల మందికి వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా తెలిపారు. దేశంలో 4.14 కోట్ల మంది వలసదారులున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని చెప్పారు.