HomeNewsMajor Movie: ‘మేజర్’ మూవీ తొలి సాంగ్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్..!

Major Movie: ‘మేజర్’ మూవీ తొలి సాంగ్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్..!

Major First Song: టాలీవుడ్లో వినూత్నమైన కథలతో అడవి శేషు మూవీలు చేస్తూ రోజురోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’లో విలన్ గా కన్పించిన అడవి శేషు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. అడవి శేషు కథాబలం ఉన్న సినిమాలు చేస్తుండటంతో అవన్నీ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. దీంతో టాలీవుడ్లో అడవి శేషుకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి.

అడవి శేష్ తాజాగా డైరెక్టర్ శశికిరణ్ తిక్కతో ‘మేజర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా చాలెంజింగ్ రోల్ లో కన్పించబోతున్నాడు. ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీ సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ను చిత్రబృందం గురువారం అందించింది.

‘మేజర్’ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ ‘నిన్నే కోరే.. నిన్నే కోరే’ను పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘హృదయమా’ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈపాటను సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. ఈ లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్ల సుదూర బంధాన్ని తెలిపేలా ప్రేమలేఖలను చూపించడం ఆకర్షణీయంగా కన్పించింది.

పుల్ మెలోడి రోమాంటిక్ సాగిపోతున్న హృదయ సాంగ్ 3.38నిమిషాలు నిడివితో ఉంది. ఇదే సాంగ్ ను మలయాళ వర్షన్లో స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ విడుదల చేశారు. మేజర్ మూవీలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాక, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీతో సోని పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంటం గమనార్హం.

Hrudayama - Lyrical | Major Telugu | Adivi Sesh | Saiee M Manjrekar | Sid Sriram | Sricharan Pakala

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version