Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ జీవితంలో మంచిగా ఉండాలని చాలా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి నప్పటికి మన చేతిలో ఆ డబ్బు నిలవదు. ఇలా డబ్బులు ఇవ్వక పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనలో ఈ మూడు దరిద్రపు అలవాట్లు కనుక ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో డబ్బు నిలవదని పండితులు చెబుతున్నారు. మరి ఆ అలవాటు ఏమిటి అనే విషయానికి వస్తే..
*ఇక మరొక అలవాటు విషయానికి వస్తే చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంటిలో పూజ చేసిన అనంతరం దేవుడికి కొబ్బరికాయ కొడతారు.అలా కొబ్బరికాయ కొట్టే ముందు కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెడతారు.అలా పెట్టమని ఏ పండితుడైనా చెప్పారో లేకపోతే ఇది వారి సొంత నిర్ణయమో తెలియదు కానీ ఈ విధంగా కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టడం వల్ల మనం ఏ దరిద్రం అయితే తొలగిపోవాలని కొబ్బరికాయ కొడతామో అంతకు పదింతలు దరిద్రం మనకు చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.
*ఇక చాలామంది మన పెద్దవారు ఆచరించిన ఆచారవ్యవహారాలను తప్పు పడుతూ ఉంటారు.సాధారణంగా మన ఇంట్లో ఒక ఫోటో ఏదైనా ఉంది అనుకుంటే అది మన తాతల తండ్రుల కాలం నుంచి మన ఇంట్లోనే ఉంటుంది.వారి విషయాల్లో అన్ని మంచి జరిగి మన విషయంలో ఏదైనా చెడు జరిగితే ఈ ఫోటో కారణంగా మనకి చెడు జరిగింది, ఈ వస్తువు కారణంగా మనకు చెడు జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అలవాటు కూడా దరిద్రానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.