HomeNewsRajini Kanth: అభిమానికి క్షమాపణలు చెప్పిన "తలైవా" రజినీకాంత్ ...

Rajini Kanth: అభిమానికి క్షమాపణలు చెప్పిన “తలైవా” రజినీకాంత్ …

Rajini Kanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఆయన ప్రేక్షకులతో, అభిమానులతో ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారు. ఆయన పెద్ద స్టార్ అన్న విషయాన్ని మర్చిపోయి ఒక ఆప్తమిత్రుడుల అభిమానులను కలుస్తూ ఉంటారు రజనీకాంత్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో చిన్న పాత్ర నుండి తలైవాగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్. అభిమానులను కలుస్తూ వారిని సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా తలైవా అభిమానులు కోసం చేసిన ఓ పనితే నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

super star rajini kanth apologies to his fan and video goes viral

భాష ఏమైనా స్టార్స్ తమను అభిమానించే వారి ఆరోగ్యం బాలేకపోతే.. నేరుగా కలవడం, మాట్లాడడం చేస్తుంటారు. అలా చేసిన ప్రతీసారి వారిపై అభిమానం మరింత పెరిగిపోతుంది. అయితే ఇటీవల రజినీకాంత్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి. ఈ పాండమిక్ సమయంలో ఆ అభిమానిని కలవలేక రజినీకాంత్ తనకొక వీడియో సందేశాన్ని పంపించారు. “హలో సౌమ్య… ఎలా ఉన్నావు?  కరోనా పరిస్థితుల వల్ల, నాకు కూడా ఆరోగ్యం బాలేకపోవడం వల్ల మిమ్మల్ని నేరుగా వచ్చి కలవలేక పోతున్నందుకు క్షమించండి. ధృడంగా ఉండు, నేను నీకోసం ప్రార్థిస్తాను. మీరు త్వరలో పూర్తిగా కోలుకుంటారు. వర్రీ అవ్వకండి అని తన అభిమానికి ఒక వీడియో సందేశం పంపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular