https://oktelugu.com/

Sirivennela: అక్షరమాలతో సిరివెన్నెలకు సుకుమార్​ నివాళి

Sirivennela: తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను క్రియేట్​ చేసుకుని.. తన కలంతో అక్షర జ్యోతిని వెలిగించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త యావత్ సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేసింది. అటువంటి సిరివెనన్నెల కలం ఇప్పుడు మూగబోయిందంటే అభిమానుల హృదయాలు చలించిపోతున్నాయి. తరలిరాద తనే వసంతం అంటూ.. తరలిరాని లోకానికే వెళ్లిపోయారు. నమ్మకు నమ్మకు ఈ రేయిని అని చెప్తూ.. ఆ రేయి చీకటిలో ఓ జ్యోతిలా కలిసిపోయారు. దీంతో, తెలుగు చిత్ర […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 2:34 pm
    sukumar
    Follow us on

    Sirivennela: తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను క్రియేట్​ చేసుకుని.. తన కలంతో అక్షర జ్యోతిని వెలిగించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త యావత్ సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేసింది. అటువంటి సిరివెనన్నెల కలం ఇప్పుడు మూగబోయిందంటే అభిమానుల హృదయాలు చలించిపోతున్నాయి. తరలిరాద తనే వసంతం అంటూ.. తరలిరాని లోకానికే వెళ్లిపోయారు. నమ్మకు నమ్మకు ఈ రేయిని అని చెప్తూ.. ఆ రేయి చీకటిలో ఓ జ్యోతిలా కలిసిపోయారు.

    Sirivennela

    Sirivennela

    దీంతో, తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహానికి పులువురు సినీ తారలు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కూడా​ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు.

    Also Read: కవీశ్వరుడు సీతారాముడికి వాణేశ్వరుడు ఇళయరాజా కవితాత్మక

    కాగా, ఇదే క్రమంలో టాలీవుడ్​ క్రియేటివ్​ దర్శకుడు సుకుమార్ తన అక్షరమాలతో వేదనను వెలబుచ్చాడు. “గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై, అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బ్రతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. మీరు ఎప్పటికి రాయని పాటలాగ మేం మిగిలిపోయాం.” అని తన స్వీయ రచన బయటకి వచ్చింది. అంటూ సోషల్​మీడియా వేదికగా పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్​గా మారింది.

    Also Read: సంప్రదాయ పద్దతిలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు… ఇక సెలవు