David Warner: సౌత్ సినిమాల పై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మోజు ఇంకా తగ్గలేదు. వార్నర్ తెలుగు సినిమాల పాటలకు డ్యాన్స్ వేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సినీ వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పుష్ప లోని శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ తో పాటు కళ్లద్దాలు పూల చొక్కా లాంటిది వేసుకొని బన్నీ లా స్టెప్ వే సి అదరగొట్టాడు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు.

అన్నట్టు డేవిడ్ వార్నర్ గతంలో ఆచార్య టీజర్‌లో మెగాస్టార్ చిరంజీవి రోల్ తన ఫేస్ ను ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసి సంగతి తెలిసిందే. మొత్తానికి అప్పుడు రీఫేస్ యాప్‌ను ఉపయోగించి చిరు ప్లేస్ లో వార్నర్ తన ముఖాన్ని పెట్టి బాగా ఆకట్టుకున్నాడు. పైగా గతంలో చేసిన కొన్ని వీడియోలలో తన భార్యతో పిల్లలతో సహా కలిసి డ్యాన్సులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్, ఈ స్టార్ క్రికెటర్ వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Also Read: జగన్ బుజ్జగించినా తగ్గేదేలే.. 7 నుంచి సమ్మెకు ఏపీ ఉద్యోగులు..

అదే జోష్‌ను ఇలా సినిమాల పై కూడా కనబరుస్తూ ముందుకు పోతున్నాడు వార్నర్. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు సాంగ్స్ కి మరియు డైలాగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.
Also Read: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?