https://oktelugu.com/

Srileela : మరో క్రేజీ మూవీ నుండి శ్రీలీల అవుట్..యంగ్ హీరో ఫైర్..పాపం టైం అసలు బాగలేదుగా!

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈమె ఒప్పుకున్న సినిమాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆమె చెయ్యి జారిపోతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవర కొండా, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి చెయ్యి జారింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 09:31 PM IST

    Srileela

    Follow us on

    Srileela :  ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఒకరు శ్రీలీల. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలలో ‘పెళ్లి సందడి’ చిత్రం ఒకటి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ కుర్ర హీరోయిన్, వరుసగా ఆఫర్స్ ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ తో ఆమె చేసిన ‘ధమాకా’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఆ సినిమా హిట్ అయ్యింది శ్రీలీల వేసిన అద్భుతమైన డ్యాన్స్ వల్లే అనే టాక్ రావడంతో చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు అందరూ ద్రుష్టి శ్రీలీల వైపు మరలింది. వరుసగా చేతికి అందిన సినిమాలంటికీ సంతకాలు చేసేసింది. దీంతో స్క్రిప్ట్స్ ఎంపిక లోపం కారణంగా వరుస డిజాస్టర్స్ వచ్చాయి, అవకాశాలు తగ్గిపోయాయి.

    మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈమె ఒప్పుకున్న సినిమాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆమె చెయ్యి జారిపోతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవర కొండా, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి చెయ్యి జారింది. ఈ సినిమాలో శ్రీలీల ని తప్పించి మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే ని తీసుకున్నారు మేకర్స్. ఇప్పుడు రీసెంట్ గా ఆమె మరో సినిమా నుండి తప్పుకుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో ముందుగా శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈమెపై కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. కానీ ఎందుకో ఇప్పుడు ఆమెని ఈ చిత్రం నుండి తప్పించి మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేయగా ఈ విషయం బయటపడింది.

    రీసెంట్ గానే నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కలిసి బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4 ‘ లో ఒక ఎపిసోడ్ కి వచ్చారు. ఈ ఎపిసోడ్ లో వీళ్ళు బాలయ్య తో సరదాగా కాసేపు చిట్ చాట్ చేసారు. మేమిద్దరం కలిసి ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రంలో నటిస్తున్నామని కూడా చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకుందంటే డైరెక్టర్ తో ఆమెకు ఏమైనా విబేధాలు ఏర్పడ్డాయా?, లేదా నిర్మాతతో సమస్యలొచ్చిందా? అని ఆరా తీస్తున్నారు నెటిజెన్స్. ఏది ఏమైనా వీళ్లిద్దరి కాంబినేషన్ చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. వీళ్ళ కాంబినేషన్ వెండితెర మీద మెరిసిపోతుంది అనుకున్నారు. కానీ ఇంతలోపే ఈ వార్త వినడం అభిమానులకు కాస్త నిరాశని మిగిలించింది. ప్రస్తుతం ఈమె చేతిలో నితిన్ ‘రాబిన్ హుడ్’, రవితేజ ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు ఉన్నాయి.