Aamir Khan: నువ్వు పనికిరావు, అమిర్ ఖాన్ ని రిజెక్ట్ చేసిన మాజీ భార్య… అంత పెద్ద స్టార్ ఆడిషన్స్ లో ఎలా ఫెయిల్ అయ్యాడు?

అమిర్ ఖాన్ దేశం మెచ్చిన నటుల్లో ఒకరు. క్లాసిక్ సబ్జెక్ట్స్ తో కమర్షియల్ హిట్స్ కొట్టిన ఏకైన హీరో. ఆయన నటించిన చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. అయితే ఓ సినిమాలో పాత్రకు ఆయన ఎంపిక కాలేదట. స్వయంగా మాజీ భార్య కిరణ్ రావ్ ఆయన్ని ఆడిషన్స్ అనంతరం రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఏమిటా చిత్రం? అమిర్ ఖాన్ చేయలేని ఆ పాత్ర ఏమిటీ?

Written By: S Reddy, Updated On : September 26, 2024 8:56 am

Aamir Khan(1)

Follow us on

Aamir Khan: ఖాన్ త్రయంలో అమిర్ ఖాన్ ఒకరు. ఒక దశలో అమిర్ ఖాన్ కెరీర్ పీక్స్ కి చేరింది. ఆయన నటించిన త్రీ ఇడియన్స్, పీకే, దంగల్ వంటి చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తుడిచిపెట్టాయి. క్లాసిక్ సబ్జెక్ట్స్ తో భారీ కమర్షియల్ హిట్స్ సాధించిన ఏకైక స్టార్ హీరో అమిర్ ఖాన్. ఆయన చిత్రాలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ సినిమా ప్రేమికుల ఆల్ టైం ఫేవరేట్. ఆ వయసులో కాలేజ్ స్టూడెంట్ గా నటించి మెప్పించడం ఎవరికీ సాధ్యం కాని విషయం.

పీకే లో సైతం ఆయన ప్రయోగాత్మక పాత్ర చేశారు. త్రీ ఇడియట్స్, పీకే సోషల్ సెటైరికల్ పిక్చర్స్. ఇక దంగల్ కోసం తన శరీరాకృతిని మార్చుకున్నాడు అమిర్ ఖాన్. తండ్రి పాత్రలో పొట్టతో కనిపించే అమిర్ ఖాన్… యువ కుస్తీ పహిల్వాన్ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్ ఉంది. చైనాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ రికార్డు నెలకొల్పింది.

పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలడు అమిర్ ఖాన్. మరి అంత గొప్ప నటుడు ఒక పాత్రకు ఎందుకు సెలెక్ట్ కాలేదు. ఆడిషన్ ఇచ్చిన తర్వాత కూడా అమిర్ ఖాన్ ని మాజీ భార్య కిరణ్ రావ్ తిరస్కరించిందట. ఈ విషయాన్ని అమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. కిరణ్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లాప్టా లేడీస్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా… రూ. 25 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.

లాప్టా లేడీస్ చిత్రాన్ని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా స్టాడింగ్ ఒవేషన్ దక్కింది. 2025కి గాను ఇండియా నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీకి లాప్టా లేడీస్ ఎంపికైంది. లాప్టా లేడీస్ మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న అమిర్ ఖాన్ కి కథ విపరీతంగా నచ్చడంతో ఒక పాత్రలో తాను కూడా నటిస్తానని కిరణ్ రావ్ తో అన్నాడట. లేదు నువ్వు స్టార్ హీరోవి. నీ ఇమేజ్ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇన్ బ్యాలన్స్ అవుతుందని, కిరణ్ రావ్ అన్నారట.

లేదు ఒకసారి మనం ఆడిషన్ చేద్దాం. ఒకే అనుకుంటే ముందుకు వెళదామని కిరణ్ రావ్ తో అమిర్ ఖాన్ అన్నారట. లాప్టా లేడీస్ చిత్రంలో రవి కిషన్ చేసిన పాత్ర కోసం అమిర్ ఖాన్ ఆడిషన్ ఇచ్చారట. అమిర్ ఖాన్ పై స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత కిరణ్ రావ్ ఒకే అనుకున్నారట. కానీ అమిర్ ఖాన్ లాప్టా లేడీస్ చిత్రంలో నటించడం వలన ప్రేక్షకుల అంచనాలు మారిపోవచ్చు. అది మొత్తంగా సినిమా ఫలితాన్ని దెబ్బ తీయవచ్చు. కాబట్టి అమిర్ ఖాన్ నటించక పోవడమే మంచిదని కిరణ్ రావ్ అభిప్రాయానికి వచ్చారట.

ఆ విధంగా అమిర్ ఖాన్ లాప్టా లేడీస్ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి తిరస్కరణకు గురయ్యాడు. లాప్టా లేడీస్ ఒకే ట్రైన్ లో తప్పిపోయిన ఇద్దరు పెళ్లి కూతుళ్ళ కథ. హిందీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రం రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన బెంగాలీ నావెల్ నౌకడుబి స్పూర్తితో తెరకెక్కించారు. కథను బిప్ లాల్ గోస్వామి అందించారు. నితాన్షి గోయల్, స్పార్ష్ శ్రీవాత్సవ నటించారు.