JD Chakravarthi : టాలీవుడ్ లో సరికొత్త ఒరవడి సృష్టించి ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు జేడీ చక్రవర్తి. ఈయన రామ్ గోపాల్ వర్మ సినిమాలకు అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ద్వారానే పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారక్టర్ రోల్స్ వేసాడు. ఆయన జనాలకు తొలిసారిగా బాగా సుపరిచితుడిని చేసిన చిత్రం శివ. ఇందులో ఆయన పోషించిన నెగటివ్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేస్తూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగాడు. ఇక ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో నటించాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సుస్థిరమైన పాత్రలు ఎన్నో చేసాడు.
అయితే మనసులో ఉన్న మాటలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటు ఉన్న జేడీ చక్రవర్తి, మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ మారింది. ఆయన అక్కినేని నాగార్జున ‘అంతం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజులవి. ఆ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే, చిరంజీవి ఘరానామొగుడు సినిమా షూటింగ్ జరుగుతుండేది అట. ప్రతీ రోజు జేడీ చక్రవర్తి షూటింగ్ ని చూసేవాడట. ఫైట్ లో ఉండే ఆర్టిస్టులు మారుతున్నారు, యూనిట్ సభ్యులు మారుతున్నారు, కానీ చిరంజీవి ఒక్కడే మారకుండా పని చేస్తున్నాడట. అప్పుడు ఆయనని చూడగానే జేడీ చక్రవర్తి కి ఇంత దుర్మార్గుడు, పని రాక్షసుడు ఏంటి ఈయన అని అనిపించిందట. ఎందుకు అలా అనిపించిందంటే, ఒక రోజు చిరంజీవి షూటింగ్ లొకేషన్ లో ఒక కారు మీద పడుకొని ఉన్నాడట. అదేంటి అంత పెద్ద హీరో, లోపల ఏసీ రూమ్ లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నాడు అని సార్ లోపలకు వెళ్లి పడుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని అడిగాడట.
అప్పుడు చిరంజీవి లోపల పడుకుంటే నన్ను వీళ్ళు నిద్ర లేపరు, అదే ఇక్కడే పడుకుంటే షాట్ రెడీ చిరంజీవి గారు అనగానే నేను లేచి వెళ్లిపోవచ్చు, డైరెక్టర్ కి మేకర్స్ కి నేను ఆ గ్యాప్ కూడా ఇవ్వదల్చుకోలేదు, అందుకే ఇక్కడే పడుకుంటున్నాను అని అన్నాడట. అది వినగానే చిరంజీవి గారెంటీ ఇంత పని రాక్షసుడు లాగా ఉన్నాడు అనిపించింది అని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. మెగాస్టార్ అనే స్థాయి అంత తేలికగా రాదు, ఎంతో కష్టం తో కూడుకున్నది, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే ఈ స్థానం వచ్చింది అనేది నేటి యువతరం గమనించాలి, ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి అంటూ జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Years of hardwork and dedication towards the cinema made him the Megastar everyone admires. The great @KChiruTweets. pic.twitter.com/pW5KqED82u
— Satya (@YoursSatya) September 15, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More