https://oktelugu.com/

Samantha : ఇండియా లోనే నెంబర్ 1 హీరోయిన్ గా సమంత..దరిదాపుల్లో మరో హీరోయిన్ లేదు..సంచలనం రేపుతున్న ఆర్మాక్స్ సర్వే!Samantha : ఇండియా లోనే నెంబర్ 1 హీరోయిన్ గా సమంత..దరిదాపుల్లో మరో హీరోయిన్ లేదు..సంచలనం రేపుతున్న ఆర్మాక్స్ సర్వే!

ప్రతీ నెల ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసే టాప్ 10 ఇండియన్ హీరోయిన్స్ లో సమంత నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ వచ్చింది. అలియా భట్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి సూపర్ స్టార్స్ ని వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం లో నిలబడడం అనేది చిన్న విషయం కాదు.

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 08:52 PM IST

    Samantha No. 1 Heroine

    Follow us on

    Samantha :  హీరోయిన్స్ లో సమంత కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు ఆ క్రేజ్ కేవలం సౌత్ ఇండియా కి మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి ఎగబాకింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ అనే హిందీ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన విలన్ పాత్ర కి పాన్ ఇండియా లెవెల్ లో ఆ రేంజ్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె ‘సిటాడెల్’ అనే మరో హిందీ యాక్షన్ వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చి, మళ్ళీ అదే స్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మధ్యలో ఆమెకి ‘మయోసిటిస్’ వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరం గా ఉండాల్సి వచ్చింది కానీ, లేకపోతే సమంత రేంజ్ ఇంకా పెద్దదిగా ఉండేదని అంటున్నారు ఆమె అభిమానులు.

    ఇదంతా పక్కన పెడితే ప్రతీ నెల ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసే టాప్ 10 ఇండియన్ హీరోయిన్స్ లో సమంత నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ వచ్చింది. అలియా భట్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి సూపర్ స్టార్స్ ని వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం లో నిలబడడం అనేది చిన్న విషయం కాదు. రీసెంట్ గానే శ్రద్దా కపూర్ స్త్రీ 2 అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇంస్టాగ్రామ్ లో ఆమెకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని మించిన ఫాలోవర్లు ఉన్నారు. కచ్చితంగా ఆమెనే ఈసారి ఆర్మాక్స్ విడుదల చేసే టాప్ 10 లిస్ట్ లో నెంబర్ 1 స్థానం లో ఉంటుందని అనుకున్నారు. కానీ నవంబర్ నెలలో కూడా సమంత నే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టు ఆర్మాక్స్ సంస్థ చెప్పుకొచ్చింది.

    మరో పక్క పాన్ ఇండియా లెవెల్లో హీరోల జాబితా లో రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఆయన కల్కి చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించడం తో పాటు, స్పిరిట్ చిత్రం గురించి సోషల్ మీడియా లో వచ్చిన గాసిప్స్ కూడా ఆయన్ని నవంబర్ నెలలో నెంబర్ 1 స్థానంలో నిలిచేలా చేసింది. డిసెంబర్ నెలలో కూడా సమంత నెంబర్ 1 స్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి కానీ, ప్రభాస్ మాత్రం హీరోల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం కష్టం. ఎందుకంటే ఈ నెల మొత్తం అల్లు అర్జున్ మేనియా నే కనిపించింది. పుష్ప 2 ప్రభంజనం తో పాటు, ఆయన అరెస్ట్ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అందుకే ఆయన ఈ నెలలో నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.