https://oktelugu.com/

Bahubali 2 : బాహుబలి 2 రికార్డ్ ను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే..?

ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సక్సెస్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. మన టాలెంట్ ను బట్టే మనకు ఇక్కడ సక్సెస్ లు దక్కుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఎలా ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 08:37 PM IST

    Bahubali 2 Record

    Follow us on

    Bahubali 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి…రాజమౌళి తీసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరినీ ఆకట్టుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేయడంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో అప్పటినుంచి తెలుగు సినిమా స్థాయి పెరగడమే కాకుండా ప్రతి డైరెక్టర్ కూడా పాన్ ఇండియా సినిమాలను చేయడానికి సాహసం చేస్తున్నారు. తద్వారా వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక బాహుబలి 2 సినిమా లాంగ్ రన్ లో 1850 కోట్లకు వరకు కలెక్షన్లను రాబట్టింది. మరి ఈ సినిమా రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. దానివల్ల సినిమాలో ఉన్న ఎమోషన్స్, ఎలివేషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని తెరకెక్కించడం వల్ల ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు ప్రేక్షకులు చూస్తూ సినిమాని సూపర్ సక్సెస్ చేశారు. తద్వారా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి.

    కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలను ఒకసారి చూడ్డానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడడం లేదు. మరి భారీ కలెక్షన్స్ ఎలా వస్తాయి. నిజానికి కంటెంట్ లో దమ్ముండి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళు ఒకటికి రెండుసార్లు సినిమాను చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన వాళ్ళ దగ్గర కంటెంట్ లో దమ్ము లేకపోవడం సినిమాని పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా అయితే ఇప్పటివరకు రాలేదు.

    ఇక ఇండియా వైడ్ గా ఈ రికార్డుని బ్రేక్ చేయగలిగే సినిమాలు ఏమీ లేకపోవడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి మరోసారి పాన్ ఇండియా లెవెల్ ను దాటి వరల్డ్ లెవెల్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

    మరి ఇక మీదట వచ్చే సినిమాలైనా బాహుబలి రికార్డును బ్రేక్ చేయగలుగుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది… బాహుబలి మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో రెండో పార్ట్ మీద హైప్ అయితే విపరీతంగా పెరిగింది. కాబట్టి ఆ హైప్ ను క్యాష్ చేసుకునే విధంగా సినిమాని తీర్చిదిద్దడంతో ఈ సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ కలెక్షన్స్ ను అయితే రాబట్టి వండర్స్ ని క్రియేట్ చేశాయానే చెప్పాలి…