RRR Movie : Cast, Story, Budget, Crew Dialogues in Telugu: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు మొదలైంది..? ఎలా పూర్తయింది..: ఫుల్ స్టోరీ RRR Movie: తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ‘రణం రౌద్రం రుధిరం‘(ఆర్ఆర్ఆర్). పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 వేల థియేటర్లలో జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో చిత్రం యూనిట్ బిజీగా మారింది. ఇప్పటికే ఫొటోలు, వీడియోలు, పాటలు, ప్రీరిలీజ్ లు, ఇంటర్వ్యూలతో ప్రమోషన్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ థియేటర్లలో సందడి చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే కరోనా, ఒమిక్రాన్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందా..? అనే అనుమానాలు నెలకొన్నాయి.. నిర్మాత డీవివి దానయ్య, దర్శకుడు రాజమౌళి థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రస్తుతానికైతే చెబుతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది.

RRR Movie Cast -ఆర్ఆర్ఆర్ లో తారాగణం
RRR Movie Cast: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవ్ గణ్ లు ప్రధాన పాత్రలుగా నటించారు. అలాగే ఒలీవియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్నస్, సముద్రఖని, ఛత్రపతి శేఖర్, శ్రీయా, స్పందన్ చదుర్వేది, చక్రీ, వరుణ్ బుద్ధదేవ్ లు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.
RRR Movie Crew-సినిమాకు పనిచేసిన నిపుణులు వీరే..
దర్శకుడు రాజమౌళి తండ్రి కె.వి విజయేంద్రప్రసాద్ ఆర్ ఆర్ఆర్ మూవీకి కథను అందించారు. దీనికి రాజమౌళి తుదిమెరుగులు దిద్దారు. ఎప్పటిలాగే సంగీత స్వరాలు కీరవాణి అందించారు. ఇక ఫొటోగ్రఫీ డైరెక్టర్ గా కె.కె. సింథిల్ కుమార్, ఎడిటర్ గా అక్కినేని శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ వ్యవహరిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ ను రమా రాజమౌళి చూసుకోగా.. డైలాగ్ లను బుర్రా సాయిమాధవ్ అందించారు.

-చిత్రీకరణ మొదలు పెట్టింది ఎప్పుడంటే?
దర్శకుడు రాజమౌళి సినిమాలు అంటే చాలా సమయం పడుతుందని సగటు ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. అయితే ఈసారి ఆయన సినిమా రావడానికి మరింత గ్యాప్ ఏర్పడింది. 2017లో బహుబలి ది కన్ క్లూజన్ విడుదలయిన తరువాత స్క్రిప్ట్ రెడీ చేసుకున్న జక్కన్న దీనిని పట్టాలెక్కించడానికి రెండేళ్లు పట్టింది. అయితే 2018లో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పి ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారని చెప్పారు. కానీ చివరికి 2019 డిసెంబర్ 6న చిత్రీకరణ ప్రారంభించారు. హైదరాబాద్లోని అల్యూమినియం కర్మాగారంలో ఫైట్ సీన్ తో సినిమా చిత్రీకరణ మొదలు పెట్ారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. అంతకుముందే 20వ శతాబ్దం సమయంలో ఢిల్లీ ఎలా ఉండేదో చూపించేలా సెట్ వేశారు.
RRR Movie Story -‘ఆర్ఆర్ఆర్’ కథ ఏంటి?
‘ది మోటార్ సైకిల్ డైరీస్’ అనే చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ తీసేందుకు స్ఫూర్తి పొందానని 2019 మార్చిలో రాజమౌళి తెలిపారు. ఆ సినిమాలో ‘చే’ అనే పాత్ర గెవారా అనే విప్లవకారుడిగా ఎలా మారుతాడో.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కథానాయకులు అదే విధంగా మారే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ఇందుకు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను కూడా కలిపి చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. తెలుగు పోరాట యోధులు అల్లుూరి సీతారామరాజు, కొమురం భీం వర్షెన్లను ప్రధానంగా చూపిస్తామన్నారు. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్ చరణ్ పోషించనున్నారు.
RRR Movie Budget-ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ఎంత?
దాదాపు రూ.400కోట్లకుపైగానే బడ్జెట్ తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీని జనవరి 7న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో విడుదల చేస్తున్నారు. అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఆ తరువాత అక్టోబర్ 13న డిక్లేర్ చేశారు. మరోసారి థర్డ్ వేవ్ భయంతో వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనవరి 7న విడుదల చేస్తామని చిత్ర నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు రాజమౌళి సంయుక్తంగా తెలిపారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అంచనాలు రెట్టింపుచేసింది. సో కరోనా కల్లోలం ముసురుకోకుంటే జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి.