https://oktelugu.com/

రాఘవేంద్రరావుకి జోడి కుదిరింది !

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇంకా ఏవేవో చేసేయాలని ఉంది. కానీ, ఒంట్లో ఓపిక లేదు. ఇప్పటికే ఆయన చేయని పని లేదు. డైరక్షన్ నుండి దర్శకత్వ పర్యవేక్షణ వరకూ, టీవీ షో నిర్మాణం నుండి సినీ నిర్మాణ రంగంలో మునిగితేలడం వరకూ ఒకటా రెండా, ఎన్ని కుదిరితే అన్నిటిని చేసి పక్కన పడేశాడు దర్శకేంద్రుడు. ఇంత చేసినా దర్శకేంద్రుడికి మాత్రం ఇంకా ఏదో చేయాలని, నేటి హీరోయిన్స్ ను కూడా అందంగా చూపించాలనే కోరిక తనకు ఉన్నట్లు ఓ […]

Written By:
  • admin
  • , Updated On : June 3, 2021 / 03:05 PM IST
    Follow us on

    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇంకా ఏవేవో చేసేయాలని ఉంది. కానీ, ఒంట్లో ఓపిక లేదు. ఇప్పటికే ఆయన చేయని పని లేదు. డైరక్షన్ నుండి దర్శకత్వ పర్యవేక్షణ వరకూ, టీవీ షో నిర్మాణం నుండి సినీ నిర్మాణ రంగంలో మునిగితేలడం వరకూ ఒకటా రెండా, ఎన్ని కుదిరితే అన్నిటిని చేసి పక్కన పడేశాడు దర్శకేంద్రుడు.

    ఇంత చేసినా దర్శకేంద్రుడికి మాత్రం ఇంకా ఏదో చేయాలని, నేటి హీరోయిన్స్ ను కూడా అందంగా చూపించాలనే కోరిక తనకు ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పైగా రాఘవేంద్రరావు మెయిన్ లీడ్ గా ఓ సినిమా కూడా రాబోతుంది. ఎలాగూ ఆయన తన సుదీర్ఘ కెరీర్ లో ఆయన చేయకుండా మిగిలిపోయింది కూడా నటన ఒక్కటే అనుకుంటా. ఇప్పుడు అది కూడా చేసేస్తున్నారు.

    రచయిత నటుడు తనికెళ్ల కథ దర్శకత్వంలో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా రానుంది. అయితే తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ రాఘవేంద్రరావుకి జోడీగా నటించబోతుంది. అలాగే హీరోయిన్ శ్రీయా కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ వేస్తుందని గ్యాసిప్ లు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే.

    స్క్రిప్ట్ కూడా పూర్తీ అయిందట. ఈ సినిమా ఓ కాలనీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని, ఈ సినిమాలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా రాఘవేంద్రరావు కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆయన భార్యగా నటి లక్ష్మి కనిపిస్తారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు గెస్ట్ హీరొయిన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు తనికెళ్ళ భరణి. అందులో ఒకరు రమ్యకృష్ణ కాగా, మరో నటిని రేఖను తీసుకోనున్నాడు.