
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం మీడియాతో సమావేశం కానున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల బీజేపీలో చేరుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించడం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈటల మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సమావేశమై ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.