PV Sindhu: మరో ‘పద్మం’ అందుకున్న పీవీ సింధు..!

బ్యాడ్మింటన్ ప్లేయర్ PV Sindhu మరో పద్మ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న పీవీ సింధు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు పీవీ సింధు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 119మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పద్మశ్రీకి 102మంది.. పద్మభూషణ్ కు 10మంది.. పద్మవిభూషణ్ కు ఏడుగురు ఎంపికయ్యారు. వీరిలో స్టార్ బ్యాడ్మింటన్ […]

Written By: NARESH, Updated On : November 8, 2021 5:29 pm
Follow us on

PV Sindhu

బ్యాడ్మింటన్ ప్లేయర్ PV Sindhu మరో పద్మ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న పీవీ సింధు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు పీవీ సింధు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

2020 సంవత్సరానికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 119మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పద్మశ్రీకి 102మంది.. పద్మభూషణ్ కు 10మంది.. పద్మవిభూషణ్ కు ఏడుగురు ఎంపికయ్యారు. వీరిలో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

2015లోనే PV Sindhu పద్మశ్రీకి ఎంపికయ్యారు. కాగా పీవీ సింధు వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన భారత ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం సాధించగా ఇటీవల జరిగిన టోక్యోలోనూ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈనేపథ్యంలోనే పీవీకి సింధుకు పద్మభూషణ్ అవార్డు దక్కింది.

కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్.. అరుణ్ జైట్లీ.. జార్జ్ ఫెర్నాండేజ్ లకు మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. వీరి కుటుంబ సభ్యులు ఆ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. హిందుస్తానీ గాయకుడు పండిట్ చన్నూలాల్ మిశ్రాకు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.

ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రామ‌న్ గంగాఖేద్క‌ర్‌.. న‌టి కంగ‌నా ర‌నౌత్‌.. హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్‌ లకు ప‌ద్మ‌శ్రీ అవార్డులు అందుకున్నారు. ఎయిర్ మార్ష‌ల్ డాక్ట‌ర్ ప‌ద్మ భందోపాధ్యాయ వైద్య రంగంలో ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు ఉండగా 16మందికి మ‌ర‌ణానంత‌రం అవార్డుల‌ను ఇచ్చారు. ప‌ద్మ అవార్డులు స్వీక‌రించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా ఉండటం విశేషం.