#SSRMB: మహేష్(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఎంతో గోప్యంగా ఉంచాలని చూస్తున్నారు మేకర్స్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సోషల్ మీడియా లో ఈ చిత్రానికి సంబంధించిన లీకులు ఆగడం లేదు. రాజమౌళి ఈ లీక్స్ పై రీసెంట్ గానే చాలా ఫైర్ అయ్యాడట. నిన్న గాక మొన్ననే ఈ ఒడిశాలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా, దానిని ఎవరో మొబైల్ లో షూట్ చేసి, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అది అప్లోడ్ అయినా నిమిషాల వ్యవధి లోనే వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. షూటింగ్ లొకేషన్స్ ఆవరణలో మొబైల్ ని ఉపయోగించకూడదని చెప్పిన తర్వాత కూడా, ఎవరు మొబైల్ తీసుకొచ్చారు, ఎవరు షూట్ చేసి ఈ వీడియో ని విడుదల చేసారు అంటూ తన టీం పై రాజమౌళి చాలా ఫైర్ అయ్యాడట. దీంతో సెక్యూరిటీ ని ఆయన మరింత పటిష్టం చేశాడు.
లొకేషన్ లో షూటింగ్ కి సంబంధించిన కెమెరాలు తప్ప, పర్సనల్ కెమెరాలను, మొబైల్ ఫోన్స్ ని అనుమతించకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్క వాకీ టాకీ తప్ప, ఎలక్ట్రానిక్ డివైస్ లను తీసుకొని రాకూడదని కఠినమైన రూల్స్ పెట్టాడు. ఈ రూల్స్ కేవలం మూవీ యూనిట్ కి మాత్రమే కాదు, హీరో మహేష్ బాబుకి, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కి, పృథ్వీ రాజ్(Prithviraj Sukumaran) లకు కూడా వర్తిస్తుందట. మహేష్ బాబు కూడా అందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే ప్రియాంక చోప్రా నిన్నటి నుండి షూటింగ్ లో పాల్గొంటుంది. ఆమె ఒడిశా విమానాశ్రయం కి చేరుకున్న సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఒడిశా లోని అడవుల చుట్టూ ఉన్నటువంటి అందమైన ప్రదేశాలను ఫోటోలు తీస్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ఇవన్నీ చూసిన అభిమానులు ఎంతో అందమైన ప్రదేశాలు, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది అన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ అవి షూటింగ్ లొకేషన్ ఫోటోలు కాదట, కేవలం తానూ ఉంటున్న రిసార్ట్స్ చుట్టూ ఉన్న ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలట. షూటింగ్ కి వెళ్లే సమయంలో ప్రియాంక చోప్రా తన మొబైల్ ని రిసార్ట్ లోనే వదిలి వెళ్తుందట. హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి, గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా కి కూడా ఇలాంటి రూల్స్ ఉంటాయని మనం ఎప్పుడూ ఊహించి ఉండము. ఇండియా లో కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత, తదుపరి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ సౌత్ ఆఫ్రికా కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు, చూడాలి మరి ఈ వెండితెర అద్భుతం ఎప్పుడు మన ముందుకు వస్తుంది అనేది.
#SSRajamouli #MaheshBabu film sets unveiled in Odisha #SSMB29 pic.twitter.com/HHRCjmzGNy
— urstrulysiddu ❤️ (@sidduudhfm) March 12, 2025