https://oktelugu.com/

Belgium : శృంగార కార్యకర్తలకు పెన్షన్.. ఆ దేశం లో కొత్త చట్టం..

కొవిడ్ తగ్గు ముఖం పట్టి మూడు సంవత్సరాలయింది. ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక ముఖచిత్రాలు తలకిందులయ్యాయి. కొన్ని దేశాలయితే చాలా సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పట్లో అవి కోలుకోవడం చాలా కష్టం.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2024 / 03:10 AM IST

    Belgium

    Follow us on

    Belgium : వ్యాపార సంస్థలు మూతపడటం.. కొనుగోళ్ళు లేకపోవడం.. డిమాండ్ లేక తయారీ పూర్తిగా పడిపోవడం వంటి పరిణామాల వల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద సంస్థలు అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మూతపడ్డాయి. కొన్ని సంస్థలు లే ఆఫ్ ప్రకటించాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఖర్చుల మీద ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉపాధి కోల్పోవడంతో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది దేశాలను విడిచి వెళ్లిపోయారు. కరోనా వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తమ వారి చివరి చూపు కూడా చూడలేని వారు చాలామంది.. ఇలా చెప్పుకుంటూ పోతే కొవిడ్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. అయితే కరోనా వల్ల శృంగార కార్యకర్తలు కూడా తీవ్రంగా నష్టపోయారు. విటులు రాకపోవడంతో ఉపాధి లేక నడిరోడ్డు మీద పడ్డారు. అయితే ఇప్పుడు వీరిని ఆదుకునే బాధ్యతను బెల్జియం ప్రభుత్వం భుజాలకు ఎత్తుకుంది. శృంగార కార్యకర్తలకు బెల్జియం ప్రభుత్వం సరికొత్త హక్కులు కల్పించింది. దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం బెల్జియం దేశంలోని శృంగార కార్యకర్తలకు పెన్షన్లు అందుకుంటారు. అధికారిక ఉద్యోగ ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్య బీమా లభిస్తుంది. ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. అనారోగ్య సెలవులు కూడా తీసుకోవచ్చు. బెల్జియం దేశంలో వ్య**** అనేది చట్టబద్ధం. వ్య**** 2022లో దీనిని నేర రహిత ఉపాధి విధానం గా బెల్జియం ప్రభుత్వం గుర్తించింది. తర్వాత శృంగార కార్యకర్తలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసింది.. ఇప్పుడు ఏకంగా వారికోసం చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా తీసుకొచ్చిన దేశంగా బెల్జియం నిలిచింది..

    వేలాదిమంది..

    ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో వ్య**** దర్జాగా నడుస్తుంది. కానీ దీనిని ప్రభుత్వం చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంగా పరిగణిస్తుంది. అందువల్లే ఇక్కడి శృంగార కార్యకర్తలకు ప్రభుత్వపరంగా పెన్షన్లు లభించడం లేదు. గతంలో ఈ తరహా డిమాండ్ తెరపైకి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. థాయ్ లాండ్ ప్రాంతంలో వ్య**** చట్టబద్ధమే అయినప్పటికీ.. అక్కడి శృంగార కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో ప్రజలు తమ జీవన ఉపాధి కోసం వ్య**** చేస్తుంటారు. కానీ అక్కడి ప్రభుత్వాలు శృంగార కార్యకర్తలకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయవు. బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో వ్య**** చట్టబద్ధమే అయినప్పటికీ.. అక్కడి శృంగార కార్యకర్తల కోసం ప్రత్యేకంగా పథకాలు అంటూ ఉండవు. కాకపోతే ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తాయి. ఇక బెల్జియం శృంగార కార్యకర్తల బాధలను చూడలేక వారి కోసం సరికొత్త సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. అయితే 2022 నుంచి బెల్జియంలో శృంగార కార్యకర్తలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకుంది.