Turmeric: ప్రతీ ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా పసుపు (Turmeric) వాడుతారు. ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని (Beauty) పెంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని (Immunity Power) కూడా పెంచుతుంది. పసుపులో ఉండే యాంటీ బయోటిక్ ఆరోగ్యానికి (Health) మంచిదని కొందరు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. ఇందులోని పోషకాలు ఎన్నో ఇన్ఫెక్షన్ల (Infections) నుంచి విముక్తి కలిగిస్తాయి. వంటల్లో పసుపు వాడటం లేదా డైరెక్ట్‌గా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటారు. అయితే పూర్వం రోజుల్లో పసుపును తయారు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో మార్కెట్‌లో దొరికే పసుపును కొనుగోలు చేస్తున్నారు. అసలు ఇది స్వచ్ఛమైనదా? కాదా? అనేది కూడా సరిగ్గా తెలియదు. ఇలాంటి పసుపు వాడటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదా? కాదా? అనేది తెలుసుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం.
నీటి పరీక్ష
పసుపు స్వచ్ఛతను పరీక్షించడానికి నీటి పరీక్ష చేయాలి. స్వచ్ఛమైన పసుపు ఎప్పుడు కూడా నీటిలో కరగదు. ఒక గ్లాసు నీటిలో పసుపు కలిపితే అది కిందకు వెళ్లిపోతే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. పసుపు కిందకు వెళ్లకుండా ఉండే అది స్వచ్ఛమైనది.
దుస్తులపై వేస పరీక్ష
పసుపును శుభ్రమైన తెల్లటి గుడ్డపై వేయండి. ఆ తర్వాత దానిని క్లీన్ చేయండి. సహజ పసుపు అయితే మరక వదులుతుంది. అదే అందులో రసాయనాలు ఏవైనా కలిపి ఉంటే మాత్రం మరక వదలదు.
వెనిగర్ పరీక్ష
పసుపు పొడిలో సింథటిక్ రంగులు ఉన్నాయా, లేదా అని గుర్తించాలంటే.. ఒక గిన్నెలో కొద్ది మొత్తంలో పసుపు వేసి వెనిగర్ వేయాలి. స్వచ్ఛమైన పసుపు ఎప్పుడు రంగు మారదు. అందులో ఏవైనా కృత్రిమ రంగులు ఉంటే తప్పకుండా మారుతుంది.
వేడి నీటి పరీక్ష
పసుపు స్వచ్ఛతను వేడి నీటి పరీక్షతో కూడా ఈజీగా గుర్తించవచ్చు. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో ఒక టీ స్పూన్ పసుపు వేయాలి. స్వచ్ఛమైన పసుపు పూర్తిగా వేడి నీటిలో కరగదు. కల్తీ పసుపు అయితే నీటిలో కరిగిపోతుంది.
రుచితో కూడా..
పసుపు రుచి కొద్దిగా చేదుగా ఉంటే అది మంచిది కాదని గుర్తించండి.
అగ్ని పరీక్ష
పసుపును కాల్చితే తొందరగా కాలిపోతే అది కల్తీ చేసినది. అలాగే ప్లాస్టిక్ వాసన వచ్చినా కూడా ఆ పసుపు కల్తీదే.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.