Pakistan Fan Girl : నేటి కాలంలో ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే.. కచ్చితంగా ఫోటోగ్రాఫర్ల కన్ను అందమైన అమ్మాయిలు మీద పడుతుంది. వారి ముఖ కవళికలు.. హావభావాలను బంధించడంలో ఫోటోగ్రాఫర్లు ముందుంటారు. మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఆ దృశ్యాలను పదేపదే చూపించి వీక్షిస్తున్న ప్రేక్షకులలో ఆసక్తిని కలగ చేస్తుంటారు. అన్ని బాగుంటాయి ఆ అమ్మాయిలు సెలబ్రిటీలు అయిపోతారు.
ఇటీవల ఐపీఎల్ జరిగినప్పుడు చెన్నై ఆడుతున్న మ్యాచ్లో ధోని అవుట్ అయ్యాడు. ధోని అవుట్ అవ్వడాన్ని తట్టుకోలేక ఓ అమ్మాయి బాధపడింది. ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయినట్టుగా తల పట్టుకుంది. ఆ దృశ్యాలను కెమెరామెన్లు అద్భుతంగా బంధించడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆమెతో ఒప్పందాలు కూడా కుదురుచుకున్నాయి. అన్ని బాగుంటే ఆ అమ్మాయి త్వరలో సినిమాలు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో కూడా ఓ అమ్మాయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధాన మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి ఇటీవల పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆకట్టుకుంది. పాకిస్తాన్ జాతీయ జెండా పట్టుకుని మైదానంలో సందడి చేసింది. ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది. పైగా హీరోయిన్ మాదిరిగా కనిపిస్తోంది. దీంతో అందరూ ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? సోషల్ మీడియాలో చలాకీగా ఉంటుందా? అనే విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి పాకిస్తాన్ జాతీయురాలని.. కాకపోతే దుబాయిలో స్థిరపడిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి తన హావభావాలతో ఒక్కసారిగా సోషల్ మీడియా ప్రపంచాన్ని మొత్తం తన చుట్టూ తిప్పుకుంది. ఒకవేళ ఆమె గనుక ఓకే అంటే ఆఫర్లు ఇవ్వడానికి కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. సినిమాలో నటించడానికి సై అంటే దర్శకనిర్మాతలు చాలామంది క్యూలో ఉన్నారు.
పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కూడా ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఫోటోగ్రాఫర్ ఎంత వెతికినప్పటికీ ఆ అమ్మాయి జాడ మైదానంలో కనిపించలేదని తెలుస్తోంది. ఒకవేళ గనుక ఆ అమ్మాయి మ్యాచ్ చూసేందుకు వచ్చి ఉంటే కచ్చితంగా ఫోటోగ్రాఫర్ ఆమెను అందరికీ చూపించేవాడు. ఆమె హావ భావాలను క్యాప్చర్ చేసి సరికొత్త కోణంలో ప్రజెంట్ చేసేవాడు. ఫైనల్ మ్యాచ్లో ఆ అందాన్ని మిస్ కావడంతో చాలామంది భగ్న హృదయులు విరహ గీతాలను ఆలపిస్తున్నారు.