
Dasara 10 Days Collection: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి ఈ స్థాయి వసూళ్లా అని విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టిన సందర్భం ఇది. అయితే ఈ చిత్రం తెలంగాణ లో ఇప్పటికీ హౌస్ ఫుల్స్ తోనే నడుస్తుంది.
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అంతటి రన్ లేకపోయినా ఏ ప్రాంత బయ్యర్ కి కూడా రూపాయి నష్టం రాలేదు.మంచి వసూళ్లే వచ్చాయి, సమ్మర్ సీజన్ కావడం తో ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికి ఈ చిత్రం విడుదలై పది రోజులు కావొస్తుంది, ఈ పది రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 50 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం పది రోజులకు గాను 59 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది.అంటే 9 కోట్ల రూపాయిలు లాభం అన్నమాట. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా పది రోజాల్లో 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఇక సీడెడ్ ప్రాంతం లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని భయపడరు బయ్యర్స్.
ఎందుకంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ ఆరు కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.ఫుల్ రన్ అంత కష్టమేమో అని అనుకున్నారు. కానీ చిన్నగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. మిగిలిన అన్నీ ప్రాంతాలలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. అలా మొత్తం మీద పది రోజులకు 59 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 65 కోట్లు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.