
Allu Arjun- Chiranjeevi: గత కొద్ది సంవత్సరాల నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో అనూహ్యమైన మార్పులు చూస్తూ వస్తున్నాము.కెరీర్ ప్రారంభం లో ఈయన మెగా ఫ్యామిలీ కుటుంబం వల్లే నేను ఈరోజు ఈ స్థానం లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చేవాడు.తన సొంత తండ్రి అల్లు అరవింద్ కంటే కూడా చిరంజీవి ఎక్కువ ఇష్టం అని ఈయన చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గురించి కూడా అప్పట్లో చాలా గొప్పగా మాట్లాడేవాడు.
కానీ ‘సరైనోడు’ సినిమా నుండి అల్లు అర్జున్ లో అనూహ్యమైన మార్పులు కనిపించాయి.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు అడిగినప్పుడు ‘చెప్పను బ్రదర్’ అంటూ ప్రారంభించాడు.అప్పటి నుండి ఈయన మెల్లగా మెగా నీడ నుండి బయటకి రావడం ప్రారంభించాడు.మెగా ఫ్యామిలీ పేరు ఎత్తడం పూర్తిగా మానేసి, అల్లు ఫ్యామిలీ అంటూ మాట్లాడడం ప్రారంభించాడు.ఇక పుష్ప సినిమా సక్సెస్ అయ్యి ఆయనకీ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ వచ్చిన తర్వాత ఇక మెగా కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు అని అనిపిస్తుంది.
నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలియచేసారు.వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకడు.అల్లు అర్జున్ కాసేపటి తర్వాత ఆన్లైన్ కి వచ్చాడు, తన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి, ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కి మరియు సంగీత దర్శకుడు థమన్ కి కృతఙ్ఞతలు తెలియచేసాడు కానీ, తన సొంత మామ చిరంజీవి విషెస్ కి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.అల్లు అర్జున్ కొంతమంది సెలబ్రిటీస్ విషెస్ మాత్రమే చూసాడు, మిగిలిన వాళ్ళవి చూడలేదు అనడానికి కూడా లేదు.

ఎందుకంటే ఆయనకి పెద్ద PR టీం ఉంది, ఎవరైనా ముఖ్యులు శుభాకాంక్షలు తెలియచేస్తే వాళ్ళు కచ్చితంగా చెప్తారు, అల్లు అర్జున్ కి చిరంజీవి శుభాకాంక్షలు తెలియచేసిన విషయం తెలిసే ఉంటుంది.అయినా కూడా స్పందించలేదు అంటే , ఆయనకీ పొగరు అనుకోవాలా..?, అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.