Nagarjuna: కొడుకులకు, తనకు.. సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ లో ఫెయిల్ అవుతున్న నాగార్జున…

నాగార్జున కొన్ని రోజుల నుంచి సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. అయితే ఆయన చేసిన ఒక సినిమా ద్వారా ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 27, 2024 9:35 am

Nagarjuna

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి కింగ్ లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాగార్జున చేసిన ప్రతి సినిమా కూడా ఒకప్పుడు మంచి విజయాన్ని సాధిస్తూ వచ్చాయి. ఇక అప్పట్లో ఉన్న టాప్ ఫోర్ హీరోస్ లో తను కూడా ఒకడిగా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమాలు సక్సెస్ లా పరంగా అతన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి.

ఇక ఇదిలా ఉంటే నాగార్జున కొన్ని రోజుల నుంచి సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. అయితే ఆయన చేసిన ఒక సినిమా ద్వారా ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నాడు. ఆయన చేయవలసిన సినిమాలు ఇవి కాదు అంటూ కొంతమంది విమర్శకులు విమర్శించినప్పటికీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. దాని ద్వారానే ఆయన చాలా వరకు కెరియర్ లో డౌన్ ఫాల్ అవుతున్నాడు. ఇక తన అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా ద్వారా ఒక భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఎప్పుడైతే ఆయన ఈ సినిమా చేశాడో ఈ సినిమాలో ఆయన చేయాల్సిన కంటెంట్ అయితే లేదు అయినప్పటికీ తను డైరెక్టర్ ను నమ్మి ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మాత్రం బారీ డిజాస్టర్ ను ఉవ్వడమే కాకుండా అప్పటినుంచి నాగార్జున కెరియర్ లో సక్సెస్ అనేది లేకుండా చేసింది. ఇక ఇది చూసిన చాలామంది సినీ క్రిటిక్స్ సైతం నాగార్జున గాడి తప్పి తన స్ట్రాంగ్ జోన్ ను ఎంచుకోకుండా వీక్ జోన్ లో సినిమాలు చేస్తూ ప్లాపులను మూటగట్టుకుంటున్నాడు అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరించిన కూడా నాగార్జున మాత్రం వాటిని పట్టించుకోకపోవడం విశేషం…

ఇక ఆయన డిఫరెంట్ గా చేయాలనే ఉద్దేశ్యం లో సినిమాలు చేస్తున్నాడు. ఒకంతుకు ఇది మంచిదే అయినప్పటికీ ఆయనకు సెట్ అవ్వని సినిమాలను కూడా ఆయన చేయడం అనేది చాలా వరకు మైనస్ అవుతుంది. ఇక చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘కుబేర ‘ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…