Mythri Movie Makers: ఏ స్టార్ హీరో అయినా, ఏ నిర్మాత అయినా తమకు సంబందించి రెండు సినిమాలను ఒకే రోజున విడుదల చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఆ సాహసం చేసే ఆలోచన కూడా చేయరు. అలాంటి సమయంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ 2023 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలను రెండు రోజుల గ్యాప్ లో విడుదల చేశారు. రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలా ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయినా మైత్రీ మూవీ మేకర్స్ ని చూసి దిల్ రాజు కూడా ఈ ఏడాది ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను మూడు రోజుల గ్యాప్ లో విడుదల చేశారు. ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్ అవ్వడంతో నష్టాల నుండి పూర్తిగా తప్పించుకున్నాడు దిల్ రాజు.
ఈ ఫార్ములా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక నిర్మాతలే ఇదే ఫార్ములా ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేము. కేవలం సంక్రాంతి సీజన్ లో మాత్రం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ ట్రెండ్ కి ఆజ్యం పోసిన మైత్రీ మూవీ మేకర్స్, మరోసారి సాహసం చేసి వాళ్ళు నిర్మించిన అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) , సన్నీ డియోల్(Sunny Deol) ‘జాట్'(Jatt Movie) చిత్రాలను నేడు విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలకు మార్నింగ్ షోస్ నుండే అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్స్ వచ్చాయి. రెండు చిత్రాలకు కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం విషయం లో అజిత్ ఫ్యాన్స్ సంబరాలకు హద్దులే లేకుండా పోయాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత వాళ్ళు ఈ చిత్రం తోనే తమ అభిమాన హీరో నుండి సూపర్ హిట్ ని అందుకున్నారు.
తమిళనాడు ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కచ్చితంగా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా నిలుస్తుందని అంటున్నారు. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇక ‘జాట్’ చిత్రానికి కూడా పాజిటివ్ రివ్యూస్ వల్ల ఓపెనింగ్స్ అదిరిపోయాయి. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 8 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఈ చిత్రాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ కి లాభాలు తెచ్చిపెట్టేవే. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు.