Mufasa: 1994లో విడుదలైన లయన్ కింగ్ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ సినిమాను 2019లో రీమేక్ చేశారు. ది లయన్ కింగ్ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ లయన్ కింగ్ $160 కోట్ల వసూళ్లు రాబట్టింది. యానిమేషన్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా ది లయన్ కింగ్ ఉంది. అలాగే వరల్డ్ వైడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో లయన్ కింగ్ 7వ స్థానంలో ఉంది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా ముఫాసా: ది లయన్ కింగ్ తెరకెక్కింది. ది లయన్ కింగ్ ఈ శుక్రవారం విడుదల అవుతుండగా ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అత్యంత ప్రాచుర్యం లభించింది. ప్రధాన పాత్ర ముఫాసా కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. చెప్పాలంటే ఆయన ఈ మూవీలో కీలక భాగమైనట్లే. ఈ చిత్రాన్ని మహేష్ బాబు వైఫ్ నమ్రత గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ముఫాసా థియేటర్స్ ఎదుట మహేష్ బాబు కట్ అవుట్స్ పెట్టడం ఊహించని పరిణామం.
స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ.. పుంబా, టిమోన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. శుభలేఖ సుధాకర్, సత్యదేవ్ సైతం గాత్ర దానం చేశారు.
ముఫాసా మూవీ తప్పక చూడాలని చెప్పే మరో అంశం… ఇది మానవ జీవితాలను ప్రతిబింబిస్తుంది. ముఫాసా పాత్ర ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఒక నాయకుడు ఎలా ఉండాలి? ఐక్యత, పోరాట పటిమ, స్నేహం వంటి అనేక విషయాలను ముఫాసా పాత్ర ద్వారా తెలియజేశారు.
2019లో వచ్చిన ది లయన్ కింగ్ తో పోల్చితే ముఫాసా: ది లయన్ కింగ్ అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. విజువల్స్ మరింత అబ్బురపరచనున్నాయి. ఒక విజువల్ వండర్ థియేటర్స్ లో చూసి ఆనందించవచ్చు. బెర్రీ జెన్కిన్స్ ముఫాసా చిత్రానికి దర్శకత్వం వహించారు. జెఫ్ నాథన్సన్ స్క్రీన్ ప్లే అందించారు. ఒరిజినల్ లో నటుడు ఆరన్ ఫెర్రే ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ $ 200 మిలియన్ తో నిర్మించింది.