MEGA154: వరుస సినిమాలతో ఫిల్ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా, మరో కొత్త సినిమాకు ఒప్పుకున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మెగా154 హస్టాగ్తో సినిమా ప్రకటించారు. శనివారం సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో దర్శకులు రాఘవేంద్రరావు, పూరీ జగ్నన్నాథ్, వివి వినాయక్, హరీశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మాస్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రఫ్‌లుక్‌తో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తూ.. పోస్టర్లో పిచ్చెక్కించేశారు చిరు. మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు. ఇందులో ఆయన తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్, ప్రోమోలు, సాంగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మరోవైపు, గాడ్‌ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు చిరు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బీజీగా గడుపుతున్న చరణ్.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తోనూ ఓ ప్రాజెక్టుకు పచ్చజెండా ఉపేశారు. ఇలా తండ్రికొడుకులు ఇద్దరూ వరుస సినిమాలతో జోరు పెంచుతున్నారు. వీరిద్దరి నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో సందడి మాములుగా ఉండదు. అలాంటిది సినిమా మీద సినిమా చేస్తూ అభిమానులకు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కలిగిస్తున్నారు. మరి బాక్సాఫీసు వద్ద వీరిద్దరు కలిసి పోటీ పడితే ఎలా ఉంటుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
