
నగరంలోని శివారులోని దుండిగల్‌లో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా ఆశ్రమ ఆవరణలో వేసిన భారీ షెడ్డు కాలి బూడిదైంది. అశ్రమంలోని రెండు ఆలయాలకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్నవెంటనే ఆశ్రమానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.