
శాంతిపురం మండలంలో మూడో రోజులుగా ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నాయి. కోనేరుకుప్పం, గొల్లప్పల్లి, వెంకేపల్లి, కృష్ణాపురం పరిసర గ్రామల్లోని రైతులు ఏనుగుల గుంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని కట్టడి చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నాటక రాష్ట్రం కామసముద్రం నుంచి అక్కడి ఫారెస్ట్ అదికారులు ఏనుగుల గుంపును ఆంధ్ర వైపు మళ్లించారు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంటల మీద పడుతున్నాయి. దీంతో పంటలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును తరమడానికి అనిమల్ ట్రాకర్స్ ను ప్రయత్నిస్తున్న ఫలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.