Vishwambhara Movie Updates: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబుల తరం ముగిసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు అనుకునే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఒక టార్చ్ బేరర్ లా మారాడు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఏ నటుడికి సాధ్యంకాని రీతిలో కొత్త తరహా హీరోను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఒక సినిమా అంటే ఎలా ఉండాలో అందులో హీరో ఎలా కనిపించాలి అనే విషయాల్లో ఆయన స్పెషల్ కేర్ తీసుకొని డిఫరెంట్ పాత్రాల్లో నటించి సక్సెస్ అయ్యాడు. స్టార్ హీరో అంటే ఎలా ఉండాలి అతని స్టాండర్డ్స్ ఏంటి కమర్షియల్ సినిమా తాలూకు విలువలు ఏంటి అనేవి తెలుసుకొని వాటిని చిరంజీవి స్క్రీన్ మీద తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడు. మొత్తానికైతే తన నటనతో ప్రేక్షకులు అందరిని తనవైపు తిప్పుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను క్రియేట్ చేయడంలో అతన్ని మించిన వారు మరెవరు లేరు… ఇక అతని తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకునే వారు ఎవరు అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే చిరంజీవి ఒకప్పుడు వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను సాధించాడు. హీరో నటన ఎలా ఉండాలి అనేది చూపించి ప్రతి ఒక్కరి చేత క్లాప్స్ కొట్టించుకున్నాడు. అలాంటి ఘనతను సాధించిన చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడిపోతున్నాడు.
ఇక 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు అంటే మామూలు విషయం కాదు. తన తోటి సీనియర్ హీరోలందరికి పోటీని ఇస్తూ యంగ్ హీరోలను సైతం బీట్ చేసేలా అతని యాక్టింగ్ ఉంటుందంటే దానికోసం ఆయన ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… మన శంకర్ వరప్రసాద్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించడానికి ఆయన చాలా కష్టపడ్డాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అప్పుడేప్పుడో స్టార్ట్ చేసిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. గత సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా ఎందుకని పోస్ట్ పోన్ అవుతూ వస్తుందనే విషయం మీద ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇక సినిమా యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో సీజీ వర్క్ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా లేదని అందువల్లే సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ మేకర్స్ చెప్పారు.
ఇక సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు. ఇంకా రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో చిరంజీవి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మన శంకర్ వరప్రసాద్ సక్సెస్ ని సాధించింది కాబట్టి సంబరాలు జరుపుకుంటున్నారు. మరి విశ్వంభర పరిస్థితి ఏంటి అంటూ యాంటీ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. విశ్వంభర సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
