Star Hero special role in Yellamma: ‘బలగం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు వేణు(Venu yeldandi) తన డ్రీం ప్రాజెక్ట్ గా ‘ఎల్లమ్మ'(Yellamma Movie) చిత్రాన్ని ప్రకటించాడు. ముందుగా ఈ సినిమాని నాని తో అనుకున్నారు , ఎందుకో కుదర్లేదు, ఆ తర్వాత నితిన్ తో అనుకున్నారు , అది కూడా సెట్ అవ్వలేదు, చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ని హీరో గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని మంచి క్వాలిటీ తో తెరకెక్కిస్తున్నారని, హీరో గా దేవిశ్రీ ప్రసాద్ లుక్స్ అదిరిపోయాయి అని, అదే విధంగా గ్లింప్స్ కి ఆయన అందించిన మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ రప్పించాయని గ్లింప్స్ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు.
అయితే ఈ ప్రాజెక్ట్ రోజులు గడిచే కొద్దీ చాలా పెద్ద ప్రాజెక్ట్ గా మారిపోతుంది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కి తండ్రి క్యారెక్టర్ కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యుంగ్ మ్యాన్ రాజశేఖర్ ని సంప్రదించారట మూవీ టీం. ఆయనకు కథ, తన పాత్ర బాగా నచ్చడం తో ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు హీరో పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన రాజశేఖర్ , ఇప్పుడు తన మార్కెట్ పూర్తిగా పోవడం తో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పటికే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘ఎల్లమ్మ’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరింది. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎలాంటి పాత్రలు పోషించబోతున్నాడో చూడాలి.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతుంది. ముందుగా సాయి పల్లవి ని అనుకున్నారు కానీ ఎందుకో ఆమె చివరి నిమిషం లో ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదు. ఇందులో హీరో క్యారెక్టర్ కి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో, హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇద్దరు డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు నటిస్తే నేషనల్ అవార్డు ని కూడా అందుకోగలరు అట. ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ అని తెలుస్తోంది. చూడాలి మరి హీరో గా దేవిశ్రీప్రసాద్ ఎలా చేస్తాడు అనేది. కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాతీయ అవార్డు గ్రహీత ఆమె. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ దొరికితే పేకాడేస్తుంది.
