
ప్రాచీన కాలం నుంచి ఆలయాలు.. మన సాంస్కృతిక వైభవాలు.. ఆలయాల్లోనే మన సంస్కృతి, కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు తెలిసేవి. ఇప్పటికే ఏ ఆలయం ఏ రాజు కట్టించాడన్నది ఈజీగా తెలిసిపోతుంది. చోళులు, పాండ్యులు, కాకతీయులు ఇలా ఏ రాజులు వారి వారి ప్రత్యేక శైలితో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణలో మరో ఆధ్యాత్మిక రాజధాని నిర్మాణానికి పురుడుపోస్తున్నారు. అందుకోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు దాని ఫలితం కనిపిస్తోంది. ఆ అద్భుత కళా సంపద, అభివృద్ధి కళ్లకు కడుతోంది.
Also Read : మళ్లీ రవి ప్రకాష్ చేతికి టీవీ 9..?
యాదాద్రిని తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆలయ పునరుద్ధరణ కోసం ఏకంగా రూ.600 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. తెలంగాణలోనే గొప్ప ఆలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు తరచూ పర్యటిస్తూ అక్కడి పనులను వేగవంతంగా చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంపై తెలంగాణ సీఎం కెసిఆర్ కోట్లు ఖర్చు పెడుతున్నారు.
తెలంగాణ సర్కార్ యాదాద్రి ఆలయ అభివృద్ధిని ఎలా చేస్తుందో తెలిపేలా తాజాగా కేటీఆర్ ఒక వీడియోను షేర్ చేశారు. రింగ్ రోడ్, పచ్చదనం మరియు కొత్తగా పునరుద్ధరించిన ఆలయం.. లోపల ఆలయ భాగం.. విగ్రహాలు, శిల్పకళా వైభవం ఎలా ఉందో తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే నిజంగా రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా యాదాద్రి ఖ్యాతికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.యాదాద్రిలో అన్ని పనులు పూర్తయిన తర్వాత సీఎం కేసిఆర్ దేశంలోని ప్రముఖ స్వామీజీలందరితో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. .
వారాంతంలో పునర్నిర్మాణ పురోగతిని పరిశీలించడానికి కేసీఆర్ యాదాద్రిని నిన్న సందర్శించారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. . ఆలయం, విల్లాస్, భక్తుల కుటీరాలు, పార్కింగ్ స్లాట్‌లను కలిపే రింగ్ రోడ్ అభివృద్ధి చేస్తున్నారు. పనులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆలయ పునరుద్ధరణతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడా యాదాద్రి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే యాదాద్రి తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
Also Read : విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ..
A sneak peek into the making of the magnificent Yadadri Sri Laxmi Narsimha Swamy temple
This is an initiative of Hon’ble CM KCR Garu & he has been personally monitoring the progress of the potential spiritual capital of Telangana 🙏#YadadriTemple
#SpiritualCapital pic.twitter.com/h8roedEvf1— KTR (@KTRBRS) September 14, 2020