Dhanush: ధనుష్, ఐశ్వర్యల డివోర్స్ ఇష్యూ పై కోలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి ‘కస్తూరి రాజా’ ఈ విడాకుల వివాదం పై వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా సర్వ సాధారణం అని అందరికి తెలుసు. అయితే, ధనుష్, ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే జరిగాయి. పైగా ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో మాతో లేరు.

ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉన్నారు. మేము కూడా దగ్గర లేము కాబట్టి.. వారి గొడవలు పెద్దవి అయ్యాయి. అయితే నేను ఫోన్ లో వారిద్దరితో మాట్లాడటం జరిగింది. ఇద్దరికీ కొన్ని సలహాలు ఇచ్చాను. నా సూచనలను కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక రజినీకాంత్ కూడా వారి విడాకుల నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని కోరారు. రజినీకాంత్ కోరిక మేరకు వాళ్ళు కూడా తమ విడాకుల నిర్ణయం పై మరోసారి పరిశీలిస్తామని తెలిపారు.
Also Read: విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు.. వేలకోట్లు ఎవరిస్తరు..?

ఇక పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికీ చాలా మంది వారిద్దరికి చెప్పడం జరిగింది. అదే విధంగా కొందరు సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా వారిని ఈ విషయంలో రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వారిద్దరూ త్వరలోనే మళ్ళీ కలుస్తారు అని మాకు నమ్మకం ఉంది’ అని కస్తూరి రాజా క్లారిటీగా చెప్పుకొచ్చాడు. మరి రజనీకాంత్, కస్తూరి రాజాల కోసం అయినా ధనుష్, ఐశ్వర్యలు తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా ? చూడాలి.