Karthika Deepam Today Episode: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇలా ఉండగా నేటి ఎపిసోడ్ లో భాగంగా హిమ కార్తీక్ ను నిలదీస్తుంది. నువ్వు మోసం చేశావు.. అబద్ధాలు చెప్పావు డాడీ…మోనిత ఆంటీని మోసం చేసింది నిజమే.. మా ఫ్రెండ్ షైనీచెప్పిన మాటలు నిజమే అంటూ అక్కడి నుంచి ఎంతో కోపంగా వెళ్ళిపోతుంది. ఈ సంఘటన అంతా చాటుగా చూస్తూ ప్రియమని తెగ సంబరపడిపోతోంది. ఇక జైల్లో మోనిత హాస్పిటల్ లో హిమ వినేలా తను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని హాస్పిటల్ లో బాంబు ఒత్తు వెలిగిస్తే దీపక్క ఇంట్లో పేలింది. దీపక్క నీకు మనశ్శాంతి ఉండనివ్వను. కార్తీక్ నన్ను రెండవ భార్యగా ఒప్పుకోవడం తప్ప మీకు మరొక ఛాన్స్ లేదంటూ తనలో తాను నవ్వుకుంటుంది.

హిమ మాట్లాడిన మాటలకు కార్తీక్ ఎంతో బాధపడగా సౌందర్య వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నా పిల్లలు ఇంత పెద్ద మాటలు మాట్లాడే అంత పెద్దవాళ్ళు అయ్యారు మమ్మీ హాస్పిటల్ కి మోనిత వచ్చిన మాట నిజమే అయితే ఆ విషయం ఇంట్లో చెబితే మరి అందరూ బాధ పడతారని చెప్పలేదు అని కార్తీక్ అనగా.. ఆదిత్య కలుగజేసుకుని ఇదే ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది ఏ విషయమైనా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు కదా ఎవరికివారు మనసులో దాచుకుంటే ఎలా..మోనిత హాస్పిటల్ కి వచ్చిన విషయం అందరి ముందు చెప్పి ఉంటే ఈ రోజు హిమ ఈ ప్రశ్నలు అడిగితే కాదు కదా అంటూ ఆదిత్య అరుస్తాడు.ఇక ఆదిత్య మాటలకు సౌందర్య ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఆదిత్య అంటూ చెప్పగా కరెక్ట్ గానే మాట్లాడాను.. నా మాటలు ఇప్పుడు బాధ పెట్టిన భవిష్యత్తులో సంతోషం పెడతాయని ఆదిత్య చెబుతాడు.
ఇక సౌందర్య హాస్పిటల్ కి మోనిత ఎలా వచ్చింది రా అని అడగగా హార్ట్ ఎటాక్ అని నాటకమాడి వచ్చింది మమ్మీ పదిహేనేళ్లుగా ఆడుతున్న నాటకమే కదా ఇది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న దీప హాస్పిటల్ కి రాగలిగినది ఎక్కడికైనా వస్తుంది జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక కట్ చేస్తే మోనిత జైలు అధికారి దగ్గరికి వెళ్లి తనని విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది. అసలే నాకు ఆరోగ్యం బాగా లేదు పైగా ఒట్టి మనిషిని కూడా కాదుఅని పోలీస్ అధికారిని కాక పెట్టగా ఆమె చూద్దాం మోనిత అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం అని సమాధానం చెబుతుంది.ఇక దీప గిన్నెలకు కడుగుతుంటే హిమ ఆవేశంగా వెళ్లి మనం ఇక్కడ ఉండదు… నాకు డాడీ నచ్చలేదు బస్తి వెళ్ళిపోదాం అంటూ అరుస్తుంది అది కాదమ్మా అని దీప సర్దిచెప్పే ప్రయత్నం చేయగా టేబుల్ పై ఉన్న ప్లేట్లు అన్నింటిని విసిరి కొడుతుంది. బంధాలు కూడా ఇంతే పదిలంగా చూసుకోకపోతే ముక్కలు అవుతాయి అని చెప్పగా హిమ అర్థం కానట్టు చూస్తుంది. నీకు అర్థం కాదని కొన్ని విషయాలు మీకు చెప్పలేదని దీప చెప్పగా హిమ కోపంతో అక్కడి నుంచి వెళుతుంది.
ఇక కార్తీక్ తన గదిలో బాధపడుతూ కూర్చోగా సౌందర్య ఆదిత్య వెళ్తారు.ఆదిత్య మాట్లాడుతూ పదే పదే ఒకే విషయం చెబుతున్నాను అని ఫీల్ కావద్దు నువ్వు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపో అన్నయ్య అక్కడ మీరు మనశాంతిగా ఉండగలరు ఇక్కడ రోజు ఏదో గొడవలు టెన్షన్స్ అమెరికాలో స్వప్న అక్క వాళ్ళు అలాగే ఉంది అమ్మలేదు నేను తనతో మాట్లాడి నీకు వీసా ఏర్పాటు చేస్తానని చెబుతాడు. అంతలో దీప వచ్చి పిల్లలు బస్తీకి వెళ్దామనీ ఇక్కడ ఉండలేమని చెబుతున్నారని అంటుంది. దాంతో కార్తీక్ మరింతగా కుమిలిపోతాడు. అయితే ఈ మాటలు అన్నింటిని ప్రియమణి దొంగచాటుగా వింటుంది.ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది మోనిత బయటకు వస్తుందా.. కార్తీక్ నిజంగానే అమెరికా వెళ్తాడా? అనేది తెలియాల్సి ఉంది.