Kalki 2 new heroine: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా పెను ప్రభంజనాలను సృష్టించింది. 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమాతో ప్రభాస్ పేరు మరోసారి మారుమ్రోగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని సినిమా ఎండింగ్ లోనే అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కానీ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫైనల్ అయిపోయింది. సినిమాకు సంబంధించిన సెట్స్ మొత్తాన్ని వేసి పెట్టారట. ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా పూర్తయిన తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్లో రాబోయే ‘కల్కి 2’ సినిమాలో తను భాగం కాబోతున్నాడు…
వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని నాగ్ అశ్విన్ చూస్తున్నాడు. ప్రభాస్ డేట్స్ కోసమే ఆయన ఈగర్ గా ఎదురు చూస్తుండటం విశేషం…కల్కి మొదటి పార్ట్ లో కల్కి కి జన్మనిచ్చే క్యారెక్టర్ లో దీపిక పదుకునే నటించింది. కానీ ఆమె పెట్టే కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉండటం, వర్కింగ్ హార్స్ తగ్గించడం తో ఆమె కల్కి 2 సినిమాలో చేయడం లేదంటూ ప్రొడ్యూసర్స్ అఫిషియల్ గా తెలియజేశారు.
Also Read: ‘సలార్ 2’ లో ప్రభాస్ తాత ఎంట్రీ ఉంటుంది : ప్రశాంత్ నీల్…
ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ను తీసుకున్నారు అనే విషయాన్ని వీలైనంత తొందరగా అఫిషియల్ గా చెప్పబోతున్నారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకైతే దురంధర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన సారా అర్జున్ ను ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దీపిక పదుకొనే ప్లేస్ లో ఆమెను నటింపజేయాలనే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారట.
ఈ విషయాన్ని తెలుసుకున్న మరికొంతమంది సినిమా మేధావులు మాత్రం ఆమె చాలా చిన్నమ్మాయి అయిపోతుంది. ఒక పిల్లాడికి జన్మనిచ్చే క్యారెక్టర్ లో ఆమె నటించడం అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండదేమో అనే అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక సారా అర్జున్ నే ఫైనల్ చేస్తారా? లేదంటే ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది…
