HomeNewsవైసీపీ కార్యకర్తలతో బ్లాక్ టిక్కెట్లు అమ్మించేందుకే సినిమా టిక్కెట్ల వ్యాపారం

వైసీపీ కార్యకర్తలతో బ్లాక్ టిక్కెట్లు అమ్మించేందుకే సినిమా టిక్కెట్ల వ్యాపారం

•ఎవరో కష్టపడి తీసిన సినిమా టిక్కెట్లు మీరు అమ్ముకోవడమేంటి
• మా నాయకుడి గురించి మాట్లాడడానికి ఆయన మీద సీబీఐ కేసులున్నాయా? ఈడీ కేసులున్నాయా.. 13 నెలలు జైల్లో ఏమైనా ఉన్నారా?
• ముఖ్యమంత్రి దగ్గర మార్కుల కోసమే వెల్లంపల్లి వేషాలు
• దేవుడి ఆస్తులు కొట్టేసిన దుర్మార్గపు మంత్రి
• అమ్మవారి సింహాలు కొట్టేసి తాంత్రిక పూజలు చేయిస్తున్నారు
• మెగా కుటుంబం ఫోటోలతో రాజకీయ భిక్ష పొందిన విషయం మరిచావా?
• విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన మహేష్

వైసీపీ కార్యకర్తలతో థియేటర్ల ముందు బ్లాక్ టిక్కెట్ల వ్యాపారం చేయించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు అమ్ముతామంటూ బయలుదేరిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ విమర్శించారు. ఎవరో కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయడం ఏంటి? ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. మూడు నెలల్లో మంత్రి పదవి ఊడిపోతుందని తెలిసి.. ముఖ్యమంత్రి దగ్గర రెండు మార్కులు కొట్టడానికే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్లు పెట్టి  పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులుచవాకులు పేలుతున్నారని విమర్శలు చేశారు.. మెగా కుటుంబం ఫోటో పెట్టుకుని రాజకీయ భిక్ష పొందిన వెల్లంపల్లికి మా పార్టీ అధ్యక్షులు   పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ… “నిన్న రాత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా కార్యక్రమంలో ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, చలన చిత్ర పరిశ్రమని వైసీపీ నాయకులు ఏవిధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏ విధంగా దోచుకోవాలనుకుంటున్నారు అనే అంశాలపై వాస్తవ స్థితిని ప్రజలకు తెలియపరచే ప్రయత్నం చేశారు. తెల్లారేసరికి కొంత మంది వైసీపీ నాయకులు పాచిపళ్లు కూడా తోముకోకుండా ప్రెస్ మీట్లకు రెడీ అయిపోయి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆయన మీద ఏది పడితే అది మాట్లాడడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద సీబీఐ కేసులు ఉన్నాయా? ఈడీ కేసులు ఉన్నాయా? ఆర్ధిక నేరాలు చేసి 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చాడా? శ్రీ పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని మనిషి ఆయన గురించి ఇష్టారీతిన మాట్లాడితే ఉపేక్షించేది లేదు.

• తల్లికీ, చెల్లికీ న్యాయం చేయలేని దుర్మార్గుడంటున్నారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాయకుడి చరిత్ర తెలుసుకోండి. వైసీపీ విజయానికి రాత్రనకపగలనక కష్టపడిన మీ జగనన్న వదిలిన బాణం ఆయన సొంత సోదరిని ఘోరాతిఘోరంగా అవమానించి రాష్ట్రం నుంచి గెంటేసిన వ్యక్తి శ్రీ జగన్ రెడ్డి. ఆయన నైజం తడిగుడ్డలతో గొంతులు కోసే నైజం అని రాష్ట్రంలో మహిళలంతా చెప్పుకొంటున్నారు. శ్రీమతి షర్మిళ గారికి ఆయన చేసిన అన్యాయాన్ని భరించలేక కన్నతల్లి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. అందుకే ముఖ్యమంత్రి గారిని తల్లికీ చెల్లికీ న్యాయం చేయలేని దుర్మార్గుడని తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రెండున్నరేళ్లుగా మీ పార్టీ అధికారంలో ఉంటే సొంత బాబాయ్ శ్రీ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారు. ఆయన కుమార్తె కూడా కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇది రాజకీయ హత్యేనన్న అనుమానం కలుగుతోంది.

• వైసీపీ వాళ్ళ కోసం బ్లాక్ టికెట్స్ స్కీమ్
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. ప్రజల నెత్తిన పన్నుల భారం వేస్తున్నారు. రౌడీయిజం, గూండాయిజాల్ని పోత్రహిస్తున్నారు. మహిళల మీద దాడులు పెరిగిపోయాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు. నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని తిట్టడానికి మాటలు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడేమో నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమా టిక్కెట్లు
అమ్ముతామంటున్నారు. గతంలో వైసీపీ ఎంపీ శ్రీ విజయసాయిరెడ్డి చెప్పినట్టు వాలంటీర్ పోస్టులు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారు. ఇంకా ఖాళీగా ఉన్న వైసీపీ కార్యకర్తల కోసం బ్లాక్ టిక్కెట్లు అమ్మించే పథకం ఏమైనా పెడతారా? ఎవరో తీసిన సినిమా టిక్కెట్లు మీరు అమ్ముకోవడం ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులు కబ్జా చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన లక్షలాది కోట్ల ఆస్తులు దోచేశారు. ఈ దుర్మార్గాలను ప్రశ్నిస్తే పోలీసుల్ని పెట్టి వేధిస్తున్నారు.

• మూడు కొబ్బరి చిప్పలు.. ఆరు కబ్జాలు…
ఈ రోజు ఉదయం విజయవాడలో ఒక సన్నాసి మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ సన్నాసి మంత్రి గారి చరిత్ర విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారు. మూడు నెలల్లో ఊడిపోయే మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఇలా రెచ్చిపోతున్నారు. నువ్వు ఎంత రెచ్చిపోయినా నీకు మార్కులు పడేది లేదు. తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ ఉండదు. ఈ బ్రహ్మానందం కామెడీలు ఆపకపోతే మాత్రం ప్రజల చేతిలో తగిన శాస్తి తప్పదు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆస్థాన విద్వాంసుల్లో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు సినిమా తీస్తే కామెడీ బాగా పండుద్ది. ఆ సినిమాకి టైటిల్స్ కూడా జనసేన పార్టీ తరఫున మేమే సూచిస్తాం. మూడు కొబ్బరి చిప్పలు.. ఆరు కబ్జాలు..ఈ టైటిల్ మంత్రి గారికి బాగా సరిపోతుంది. అది కాకపోతే బందరు రోడ్డులో భూమ్ భూమ్.. వన్ టౌన్ వెస్ట్ లో వేస్ట్ ఫెల్లో వంటి టైటిల్స్ అతికినట్టు సరిపోతాయి. దేవుడి ఆస్తులు కబ్జా చేసి దొంగిలించే పనికిమాలిన మంత్రి నువ్వు. నువ్వు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావా? దేవాదాయ శాఖకు గబ్బు పట్టించిన దుర్మార్గపు మంత్రివి నువ్వు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కార్పోరేటర్ ని కూడా గెలిపించుకోలేకపోయిన నువ్వు జనసేన గురించి మాట్లాడుతావా? 2014లో ఎమ్మెల్యేగా ఉండి ఒక్క కార్పోరేటర్ ని కూడా గెలిపించలేని సన్నాసివి జనసేన పార్టీ గురించి మాట్లాడుతావా? 2009లో సర్.. సర్ అంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బ్రతిమలాడుకున్న రోజులు మర్చిపోయావా?

* మైలపడ్డ మంత్రి
గతంలో ప్రారంభోత్సవాల పేరిట ఏం చేశావో నీ పురాణాలన్నీ విజయవాడ ప్రజలకు గుర్తే వున్నాయి. ఈ రాష్ట్రం ఇంత అరిష్టం పట్టడానికి, అధోగతి పాలవడానికి మైల మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసే కారణం. మాట్లాడేందుకు ఈ మాటలు కొంచం బాధించేవే అయినా ఇది దేవాదాయశాఖ కాబట్టి చెప్పక తప్పదు. గత ఏడాది మీ బాబాయ్ గారు, తల్లి గారు, ఈ సంవత్సరం మీ తండ్రి గారు కాలం చేశారు. 2022 జులై నెల వరకు ఆయనకు మైల ఉంది. మైలతో దేవాలయాలు సందర్శించవచ్చా? మఠాలకు పీఠాలకు వెళ్లవచ్చా? మైల ఉన్నా వెళ్లడం వల్ల దేవాలయాలు, మఠాలు, పీఠాలు మైలపడుతున్న మాట వాస్తవం కాదా? దీనికి మీరు చెబుతారో, మీ పార్టీ స్వామీజీలతో సమాధానం చెప్పిస్తారో చెప్పించండి. మంత్రి వెల్లంపల్లికి దైవశక్తి మీద నమ్మకం పోయింది. క్షుద్ర శక్తుల్ని, చీకటి శక్తుల్ని నమ్మి కనకదుర్గమ్మవారి రథానికున్న మూడు సింహాలను మాయం చేసి తాంత్రిక పూజలు చేయిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుడికి దేవాదాయ శాఖ కట్టపెడితే.. ఇష్టానుసారం ఆలయాల భూములు, ఆస్తులు కబ్జా చేయక ఇంకేం చేస్తారు. దైవశక్తుల మీద నమ్మకంలేని వ్యక్తుల చేతులో దేవాదాయ శాఖ పెడితే కబ్జాలు చేయక ఇంకేం చేస్తారు? రాష్ట్రవ్యాప్తంగా 150 దేవాలయాల మీద దాడులు చేస్తే.. ఒక్క ఘటన కూడా విచారణ పూర్తి చేయించలేని సన్నాసివి నువ్వు. నువ్వా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది. మెగా కుటుంబం ఫోటో పెట్టుకుని రాజకీయ భిక్ష పొంది, వారి ఫోటోలతో ప్రచారం చేసుకుని ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావా? నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు.. సన్నాసి మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదు. ఇంకా మాట్లాడితే రాష్ట్రంలో నీకన్నా సన్నాసి అసమర్ధుడు ఎవరున్నారు?

• ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి
ముందుగా మీరు పరిపాలన సరిగా చేయండి. మా పార్టీ గురించి మా పార్టీ నాయకుడి గురించి తర్వాత మాట్లాడవచ్చు. ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వండి. ప్రజలకు ఫించన్లు ఇవ్వండి. గోతులు పడిన రోడ్లు పూడ్చండి. అక్టోబర్ 2వ తేదీన మాకు శ్రమదానం చేయాల్సిన అవసరం లేకుండా చేయండి. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఏది పడితే అది మాట్లాడుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించేది లేదని మరోసారి హెచ్చరిస్తున్నాం” అన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular