Tirumala Laddu Controversy:  తిరుమల లడ్డూ వివాదం: సుప్రీం ఆదేశాలపై చంద్రబాబు ఇలా.. జగన్ అలా..*

మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు జగన్.సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు తీరు జాతీయస్థాయిలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : October 4, 2024 5:16 pm

Tirumala Laddu Controversy

Follow us on

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది.సిబిఐ నుంచి ఇద్దరు,ఏపీ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు,ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒక అధికారితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.ఈ ఈ వివాదం పై బహిరంగంగా ఎవరు మాట్లాడవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిని స్వాగతించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే దీనిపై తాజాగా స్పందించారు మాజీ సీఎం జగన్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ వైసిపి సీనియర్ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో కల్తీ వ్యవహారంపై చంద్రబాబు వేసిన సిట్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబు దానిని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేవుడంటే భయము, భక్తి లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలను టిడిపి వక్రీకరిస్తుందని జగన్ విమర్శించారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆక్షేపించారు. తిరుమలలో జంతు కొవ్వు కలిపిన వ్యవహారం పై సుప్రీంకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని ఆధారాలు లేకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా బయట పెడతారని ప్రశ్నించింది. అయితే అదే సమయంలో టీటీడీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టింది. బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి అంటూ ట్విట్ పెట్టిన విషయాన్ని జగన్ తాజాగా గుర్తు చేశారు. చంద్రబాబుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసినట్లు నేషనల్ మీడియా రిపోర్టు చేసిందని జగన్ గుర్తు చేశారు. అదే సమయంలో టిడిపి సోషల్ మీడియా మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైనాన్ని ప్రస్తావించారు జగన్.

* అదేపనిగా ప్రచారం
చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చినప్పుడు టీటీడీ ఈవో పదేపదే చెప్తున్నారని.. అయినా సరే అదేపనిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఎంత జరిగినా తిరుమల అన్న, తిరుపతి అన్న, నాకు భయం లేదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం దారుణం అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోవడం తప్పదని హెచ్చరించారు జగన్.

* ఆ అనుమానంతోనే
ఈ వివాదంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆది నుంచి తమకు అనుమానం ఉందని చెప్పుకొచ్చారు జగన్.అందుకే కోర్టులను ఆశ్రయించామని, ప్రధాని మోడీకి లేఖ రాశామని గుర్తు చేశారు. సెప్టెంబర్ 25న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా.. దానిని వక్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తునుకాదని..కోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిందంటే తప్పు ఎవరిదో అర్థమవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. దీనిపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.