https://oktelugu.com/

Indian 3 OTT: భారతీయుడు 3 ఓటిటి లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి..? శంకర్, కమల్ హాసన్ మధ్య జరిగిన గొడవ ఏంటి..?

తమిళం లో రజినీకాంత్ తో పాటు పోటీ పడి సినిమాలు తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్న వాళ్లలో కమల్ హాసన్ ఒకరు... వీళ్లిద్దరు తమిళ్ ఇండస్ట్రీ కి రెండు కండ్ల లాంటి వాళ్ళు కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 5:09 pm
    Indian 3(1)

    Indian 3(1)

    Follow us on

    Indian 3: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి కమల్ హాసన్…ఆయన వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్న హీరోల్లో తనుకూడా ఒకరు కావడం విశేషం…ఇక ఆయన తమిళ్ లోనే కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలను కూడా చేశాడు. ముఖ్యంగా కే విశ్వనాధ్ డైరెక్షన్ లో ఆయన చేసిన సినిమాలు మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను కూడా అందుకుంటున్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. ఒక దానికి అనుగుణంగానే ఆయన చేసిన విక్రమ్ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇప్పటికే భారతీయుడు 2 సినిమాతో కొంతవరకు డిజాస్టర్ ని మూటగట్టుకొని భారతీయుడు 3 సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

    ఇక భారతీయుడు 2 సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ కేవలం 150 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే వసూల్ చేసింది. ఇక దాంతో లైకా ప్రొడక్షన్స్ వాళ్లకి భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఇప్పుడు భారతీయుడు 3 సినిమాని పూర్తి చేసి దాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేయాలని లైకా పిక్చర్స్ వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నప్పటి నుంచే శంకర్ కమల్ హాసన్ కి సరిగ్గా సెట్ అవ్వడం లేదట.

    వాళ్ళ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి కమల్ హాసన్ కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ కు కూడా రాలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి… మరి ఇలాంటి సందర్భంలో భారతీయుడు 3 సినిమా విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరుగబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో శంకర్ కూడా ఈ సినిమాను తొందరగా చుట్టేసి ఓటిటి రిలీజ్ చేస్తే బెటర్ అని తను భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా అయితే ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు జరిగిన నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చనే ఉద్దేశ్యం తోనే శంకర్ అలాంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే శంకర్ కమల్ హాసన్ మధ్య గొడవ జరగడం అనేది ఇప్పుడు లైకా పిక్చర్స్ వాళ్ళకి భారీగా ఇబ్బందిని కలిగిస్తుందనే చెప్పాలి. చూడాలి మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాని పూర్తి చేసి ఓటిటి లోనే రిలీజ్ చేస్తారా? లేదంటే లాస్ట్ ? యూనిట్ లో థియేటర్లోకి తీసుకొస్తున్నామని సడన్ సర్ ప్రైజ్ ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది…