IPL 2025 : హార్దిక్, అయ్యర్, పాటిదార్, గిల్ నేతృత్వం వహిస్తున్న జట్లు ప్లే ఆఫ్ వెళ్ళిపోయాయి. అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు హార్దిక్ జట్టుపై గెలిచి టాప్ -2 జాబితాలోకి వెళ్లిపోయింది. ఇక లక్నోతో జరిగే సమరంలో బెంగళూరు విజయం సాధిస్తే టాప్ -2 జాబితాలోకి మరో జట్టుగా వెళ్తుంది. మొత్తంగా ఈ సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరి మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని లక్నో భావిస్తోంది.. ప్లే ఆఫ్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత జూన్ 3న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ న భూతో న భవిష్యతి అనే స్థాయిలో నిర్వహించాలని ఐపిఎల్ నిర్వాహక కమిటీ భావిస్తోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల ఉగ్రవాద దేశంతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టంగా భద్రతను కల్పించబోతోంది. అయితే ఈసారి ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఎవరు ఊహించని వ్యక్తులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దూమాల్ ప్రకటించారు.
Also Read :అభిమానుల కోసం ఆర్సీబీ చేసిన పనికి హాట్సాఫ్: రోమాలు నిక్కబొడిచే వీడియో ఇది.
అరుణ్ దూమాల్ ప్రఖ్యాత “ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్” మాట్లాడారు..” ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం శక్తిసామర్థ్యం అందరికీ తెలిసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు మరింత ఎక్కువ తెలిసింది. మన దేశం మీదికి ఎవరైనా వస్తే తుక్కుతుక్కు చేస్తామని అర్థమైంది. ఆపరేషన్ సిందూర్ లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారత సైన్యం శత్రు దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మరోవైపు శత్రుదేశ మూకలను తరిమి తరిమి కొట్టింది. ఇటువంటి గొప్ప పనులు చేసిన భారత త్రివిధ దళాలను సన్మానించుకోవడం.. గౌరవించుకోవడం మన విధి. అందువల్లే ఈసారి అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు త్రివిధ దళాల అధిపతులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు” అరుణ్ దుమాల్ పేర్కొన్నారు.. అయితే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ప్రకటించినట్టు తెలుస్తోంది.. ఇక ఐపీఎల్ పునః ప్రారంభమైన తర్వాత.. జరిగిన తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పటికీ.. దానికంటే ముందు భారత సైన్యం చేసిన సాహసోపేతమైన విన్యాసాలను.. భీకరమైన పోరాటాలను గుర్తు చేసుకుంటూ.. ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలను చేతిలో పట్టుకుని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఐపీఎల్ నిర్వాహక కమిటీ కేంద్రం అనుమతి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్రివిధ దళాల అధిపతులు ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వస్తారా? అనేది ఒకింత ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ తర్వాత బార్డర్ ఏరియాలలో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాలేనట్టు తెలుస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా శత్రుదేశం దిక్కుమాలిన దాడులు చేసే అవకాశం ఉంది. పైగా ఉగ్రస్తావరాలను కూల్చివేసిన నేపథ్యంలో.. ముష్కరులు మన మీద ఏ సమయంలోనైనా ఘాతుకాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అందువల్లే త్రివిధ దళాల అధిపతులు ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కు ఇంకా చాలా రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. త్రివిధ దళాధిపతుల రాక పై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
IPL Chairman Arun Dhumal via IANS:
“We have invited all three service chiefs of the Indian Armed Forces to attend the IPL final on June 3 in Ahmedabad – The theme is to honour our heroes of Operation Sindoor”. pic.twitter.com/HP8rjs2c63
— Johns. (@CricCrazyJohns) May 27, 2025