HomeNewsInstagram New Features: ఇంస్టాగ్రామ్ యాప్ లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలంటే?

Instagram New Features: ఇంస్టాగ్రామ్ యాప్ లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలంటే?

Instagram New Features: సోషల్ మీడియాలో టాప్ వన్ ప్లేస్ లో ఉన్న యాప్ లలో ఇంస్టాగ్రామ్ యాప్ ఒకటి. ఎంటర్టైన్మెంట్ తో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమ టాలెంటును చూపించుకోవడానికి కూడా ఈ యాప్ సహాయపడుతుంది. అయితే మెటా సంస్థకు చెందిన ఈ యాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో అందుబాటులోకి తీసుకొచ్చి అలరిస్తోంది వీటిలో కొన్ని ఫీచర్లు ప్రస్తుతం అమల్లో ఉండగా.. మరో ఫ్యూచర్ మాత్రం ఇతర దేశాల్లో కొనసాగుతోంది. ఇంతకీ ఆ ఫీచర్లు ఏవి? అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Read Also: 171 ఏళ్ల పోస్టల్ సర్వీస్ రద్దు.. బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకూ ఏం మారింది?

టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిన తర్వాత ఇంస్టాగ్రామ్ యాప్ అభివృద్ధి చెందింది. ఫోటోలు, వీడియోలు అప్డేట్ చేయడానికి.. ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఒక్కోసారి మనం అనుకున్న వీడియోలను అప్లోడ్ చేయలేక పోతుంటాం. కానీ మనం అనుకున్న వీడియోను మన ఫ్రెండ్ లేదా ఇతరులు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోను మన ఫాలోవర్స్ చూసి.. మనకు ఇంప్రెస్ రావడానికి కొత్తగా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనినే రీ పోస్ట్ అని అంటారు. అంటే ఒకరు ఏర్పాటు చేసుకున్న వీడియోను దానిని రిపోర్టు చేయడం వల్ల మన ఫాలోవర్స్ ఆ వీడియోలను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా లైక్స్ కూడా వస్తే అవి మనకే చెందుతాయి. అయితే అధికారికంగా మాత్రం వర్జినల్ యూజర్ కి వెళుతుంది.

ఈ యాప్ లో మరో ఫీచర్ ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో ఒక ఐకాన్ పై క్లిక్ చేయగానే.. స్క్రీన్ పైన ఫ్రెండ్ టాప్ కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేస్తే చాలు ఆ ఫ్రెండ్ చూసిన రీల్స్, రియాక్ట్ అయిన తీరు తెలుస్తుంది. అయితే మన రీల్ కు సంబంధించిన లైక్స్, కామెంట్లు ఎవరికి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. రీల్స్ పై ఇతరులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది కూడా ఎవరికి కనిపించకుండా చేసుకోవచ్చు.

Read Also: టార్గెట్ వైసిపి.. కాంగ్రెస్ లోకి బలమైన కుటుంబం?

ఇందులో ఆకర్షించే మరో ఫీచర్ మ్యాప్. ఈ ఫీచర్ ద్వారా ఎవరైతే లైక్స్ కొట్టారో.. ఎవరైతే ఫాలో అవుతున్నారో.. ఎవరైతే రీల్ను అప్డేట్ చేస్తున్నారో వారికి సంబంధించిన లొకేషన్ ను తెలుసుకోవచ్చు. సాధారణంగా లోకేషన్ ఆప్షన్ డి పాటులో ఆఫ్ అయి ఉంటుంది. అవసరమనుకుంటే దానిని ఆన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ మన భారత్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో కొనసాగుతోంది.

ఇలా ఈ ఫీచర్ ఇంస్టాగ్రామ్ వాడేవారికి ఉపయోగకరంగా ఉండబోతుంది. అయితే ఇంస్టాగ్రామ్ యాప్ అప్డేట్ అయిన తర్వాత ఇవి కనిపిస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మధ్య కమ్యూనికేషన్ మరింతగా పెంచుకునేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు యాజమాన్యం తెలుపుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version