Homeక్రీడలుక్రికెట్‌india vs england : ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా : మ్యాచ్ విన్నర్ ను మేనేజ్మెంట్...

india vs england : ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా : మ్యాచ్ విన్నర్ ను మేనేజ్మెంట్ ఎందుకు విస్మరిస్తోంది..

india vs england : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో టీమిండియా మొదటి మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల ఓడిపోయింది. దీంతో లార్డ్స్ లో జరిగిన మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ట్రోఫీ అందుకునే అవకాశం ఏర్పడింది. రెండు జట్లు చెరొక విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం జరిగే మూడో వన్డే మీద ఆసక్తి పెరిగింది. రెండు జట్టలో సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా ఇంగ్లాండ్ మైదానాలు సీమర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ స్పిన్ బౌలర్లు సత్తా చూపించడం అంత ఈజీ కాదు. అయితే ఇలాంటి మైదానాల మీద భారత స్పిన్ బౌలర్ కులదీప్ యాదవ్ కు అద్భుతమైన రికార్డు ఉంది. అతడు అనేక సందర్భాలలో టీమిండియా కు విజయాలు కూడా అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్లు తీసే స్పిన్ బౌలర్ గా కులదీప్ యాదవ్ కు పేరు ఉంది. అయితే మేనేజ్మెంట్ అతడిని రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం చేస్తోంది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్ కు అవకాశాలు ఇస్తోంది. వాస్తవానికి ఇంగ్లాండ్ మైదానాల మీద కులదీప్ యాదవ్ సంచలన ప్రదర్శన చేయగలడు. బంతిని అనేక విధాలుగా తిప్పగలడు. పైగా గూగ్లీ.. వికెట్ టు వికెట్.. బంతులను వేసి బ్యాటర్లను అయోమయానికి గురి చేయగలడు.

అటువంటి కులదీప్ యాదవ్ ను మేనేజ్మెంట్ పక్కన పెట్టడం పట్ల ఆశ్చర్యం కలుగుతుంది. కులదీప్ యాదవ్ ను పక్కన పెట్టడం పట్ల భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భారత జట్టు కూర్పును మార్చిన ప్రతి సందర్భంలోనూ కులదీప్ యాదవ్ మీద వేటువేస్తుంటారని అతడు ఆరోపించాడు. కులదీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఆట స్వరూపం పూర్తిగా మార్చగలడు. కులదీపు పరుగులను కట్టడి కూడా చేయగలడు. కీలక భాగస్వామ్యాలను విచ్చిన్నం చేయగలడు. కండల గాయం వల్ల మూడో వన్డే కు సుందర్ దూరమయ్యాడు. అతని స్థానంలో యాదవ్ ను తీసుకొని ఉంటే బాగుండేది. కానీ మేనేజ్మెంట్ అలా చేయడం లేదు. అందువల్లే మాజీ క్రికెటర్లు మేనేజ్మెంట్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమర్ధుడైన ఆటగాడిని రిజర్వ్ బెంచ్ కు పరిమిత చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper