
ఇంగ్లండ్ ను భారత్ వైట్ వాష్ చేసింది. అటు టెస్టుల్లో ఇటు టీ20ల్లో .. వన్డేల్లో కూడా సిరీస్ విజయాలను సాధించి పూర్తి ఆధిపత్యం సాధించింది. ఉత్కంఠగా సాగిన చివరి వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయం అంచులదాకా వచ్చి చతికిలపడింది. ఆల్ రౌండర్ సామకరన్ సెంచరీకి చేరువగా వచ్చి దాదాపు ఇంగ్లండ్ ను గెలిపించినంత పనిచేశాడు.
కానీ చివరి ఓవర్ లో యార్కర్ కింగ్ నటరాజన్ అద్భుతమే చేశాడు. చివరి ఓవర్ లో 15 పరుగులు కావాల్సిన దశలో చివరి ఓవర్ ను వేసిన నటరాజన్ తన యార్కర్లతో తక్కువ పరుగులు ఇచ్చి భారత్ ను గెలిపించాడు.
ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 9 వికెట్లకు 322 పరుగులే చేయగలిగింది. చివరి ఫైనల్ లో ఇండియా దుమ్మురేపింది. ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో గెలిచింది.
భువనేశ్వర్ 3 వికెట్లు, శార్ధుల్ 4 వికెట్లు తీయగా కీలకమైన లాస్ట్ ఓవర్ లో 15 పరుగులు చేయాల్సిన దశలో నటరాజన్ తక్కువ పరుగులు ఇచ్చి ఇండియాను గెలిపించాడు. చివరి వరకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ టీంను గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నించాడు. చివరకు ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.